ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేయబడ్డాయి
కథ పాక్షికంగా రాయబడింది
పంక్తి 28:
 
కార్తీక్ అనే యువ అసిస్టంట్ డైరెక్టరుకీ, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మళయాళ క్రిష్టియన్ అమ్మాయికీ మధ్య నడిచిన ప్రేఅమాయణాన్నీ, ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపధ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో ఈ సినిమా "విన్నైతాండి వరువాయా" పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా నటవర్గం, పతాక సన్నివేశం ఏ మాయ చేశావే సినిమాకి పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. కానీ ఈ సినిమా హింది పునః నిర్మాణమైన ఏక్ థా దీవానా మాత్రం పరాజయం చవి చూసింది.
 
==కథ==
తన ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న కార్తీక్ సినిమా దర్శకుడవ్వాలని కలలు కంటుంటాడు. తన స్నేహితుడి ద్వారా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దగ్గర అసిస్టంట్ గా చేరుతాడు. ఇంతలో తన ఇంటి పైపోర్షనులో కేరళ నుంచి వచ్చిన ఒక క్రిష్టియన్ కుటుంబానికి కార్తీక్ ప్రోత్సాహం మీద ఇల్లు అద్దెకి ఇస్తాడు కార్తీక్ తండ్రి. ఐతే వాళ్ళ కూతురు జెస్సీని చూసి ప్రేమలో పడతాడు కార్తీక్. తన తండ్రికి భయపడుతున్న కార్తీక్ ఒక రోజు ఎవరూలేని సమయం చూసి జెస్సీకి తన ప్రేమ విషయం చెప్తాడు. దీనికి ఒప్పుకోని జెస్సీ తరవాత తన ఊరికి బయలుదేరిందని కార్తీక్ తెలుసుకుంటాడు. తన స్నేహితుడితో కలిసి ఆ ఊరికి చేరుకున్న కార్తీక్ జెస్సీని కలిసి తన ప్రవర్తనకు క్షమాపణలడిగి, స్నేహితులుగా కొనసాగుదామని చెప్తాడు.కార్తీక్ పై ఎలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన జెస్సీ తన స్నేహానికి ఒప్పుకుని తన ఇంట్లోవారికి తన క్లాస్ మేట్ గా పరిచయం చేస్తుంది.
 
ఆపై ట్రైనులో హైదరాబాద్ కు వెళ్తున్నప్పుడు కార్తీక్ జెస్సీని ముద్దుపెట్టుకుంటాడు. మళ్ళీ గొడవలు మొదలవుతాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనుకున్న జెస్సీ సోదరుడు కార్తీక్ తో గొడవ పెట్టుకుని తన్నులు తింటాడు. జెస్సీ తల్లిదండ్రులకు కూడా అనుమానం రావడంతో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదని జెస్సి తేల్చిచెప్పడంతో పెళ్ళి ఆగిపోతుంది. జెస్సీని చూడాలని వచ్చిన కార్తీక్ జరిగింది తెలుసుకుని జెస్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ జెస్సీని కలిసి తనని జెస్సీ గాఢంగా ప్రేమిస్తోందనీ, ఇది తెలిస్తే రెండు కుటుంబాల్లో గొడవలు చెలరేగుతాయనీ తన మాటలను బట్టి తెలుసుకుంటాడు కార్తీక్. ఆపై వారిద్దరు వారి కుటుంబాలకి తెలియకుండా హైదరాబాద్ లో ఒకరినొకరు ప్రేమించుకుంటూ హాయిగా కాలం వెళ్ళదీస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు