పురందర దాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
==జీవితచరిత్ర==
పురందర దాసు క్రీ.శ. 1484లో [[పూనా]] సమీపాన గల గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వరదప్ప నాయక్ ప్రముఖ వడ్డీ వ్యాపారి. తల్లిదండ్రులు [[వెంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] భక్తులగుటచేత పురందరునికి శ్రీనివాస నాయక్ అని నామకరణం చేశారు. శ్రీనివాసుడు బాల్యంలో సంస్కృతం, కన్నడం చదువుకున్నాడు. తరువాత సరస్వతీ బాయినిచ్చి పెండ్లి చేశారు. తండ్రి చనిపోయిన తరువాత ఆతని అడుగుజాడలలో వ్యాపారం చేస్తూ లక్షలకు లక్షలు గడించాడు. మిక్కిలి ధనవంతునిగా గణనకెక్కాడు. పిసినారిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు పరమేశ్వరుడు భార్యద్వారా జ్ఞానోదయం కలిగించాడు. పిదప తన సర్వస్వం బీదలకు పంచిపెట్టి, కట్టుబట్టలతో విద్యానగరం ([[విజయనగరం (కర్ణాటక)|విజయనగరం]]) చేరాడు. వ్యాసరాయలను ఆశ్రయించాడు. నాటి నుండి శ్రీనివాసులు పురందర దాసుగా దేశం నలుమూలలా హరినామ సంకీర్తనం చేస్తూ తిరిగాడు. సాధారణ భక్తి భావం మొదలుకొని, కీలకమైన తత్త్వబోధ ఆయన కీర్తనలలో కనిపిస్తాయి.
 
 
పురందరదాసు ఎనభై సంవత్సరాలు జీవించి క్రీ.శ. [[1564]]లో కాలధర్మం చెందాడు. పుట్టుకతో మహారాష్ట్ర వాడైనా కన్నడ భాషలో రచనలు చేసి, కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపి, కర్ణాటక ప్రజలకు ప్రీతిపాత్రుడైనాడు.
 
తన వాగ్గేయ కృతులకు ఈయన, సమకాలికులికులైన ఆంధ్ర పదకవిత పితామహుడైన [[అన్నమాచార్య|అన్నమాచార్యులను]] గురువుగా భావించాడు.<ref>[http://www.youtube.com/watch?v=ACaTtl8383U| అన్నామాచార్యులతో పురందరదాసులు] </ref> వ్యాసతీర్థలు, కనకదాసులు ఈయనకు ఇతర సమకాలికులు.
 
== పురందర దాసు మరియు కర్ణాటక సంగీతము ==
కర్ణాటక సంగీత సాధనకు పురందర దాసు అనేక శాస్త్రీయ పద్దతులు కనుగొనెను. ఏన్నొ వందల సంవత్సరములు గడిచినా, ఈ నాటికి అవే పద్దతులను సంగీత భొధనకు ఉపయోగించడం ఒక విషేశం. ఇతను కర్ణాటక సంగీతంలొ ప్రధానమైన "రాగ మాయమాళవగౌళ" పద్దతిని అవిష్కరించెను. ఇతర భోధనా పద్దతులైన స్వరావళులు, జంట స్వరాలు, అలంకారాలు, లక్షణ గీతాలు, ప్రబంధాలు, యుగభోఘలు, దాటు వరసలు,గీతాలు, సూలదిలు, కృతులు వంటి ఆంశాలు కూడా కనుగొనెను.
సాధరణ మానవులు కూడా అనువుగా పాడుకొనుటకు అనువైన జానపదులను కూడా రచించెను.
పురందర దాసు ఒక వాగ్గేయకారుడు, సంగీత అధ్యయన వేత్త, కృతి కర్త. ఆందుకే అతన్ని "కర్ణాటక సంగీత పితామహా" అని పిలుస్తారు. కర్ణాటక సంగీతంలొ మొదటి లాలి పాటను రచించి, శ్రుతులు కట్టినాడు.
 
== పురందర దాసు మరియు త్యాగరాజు ==
"https://te.wikipedia.org/wiki/పురందర_దాసు" నుండి వెలికితీశారు