ఒమర్ ఖయ్యాం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q35900 (translate me)
చి Wikipedia python library
పంక్తి 56:
ఖయ్యాము నిషాపూరులో జన్మించినప్పటికి బాల్యము బల్ఖలో గడచెను.ఖయ్యాము విద్యాభ్యాసము నిషాపూరులో వున్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఇమాం మువఫి'క్ అను గురువు వద్ద జరిగినది.ఖయ్యాముకు, '''నిజాముల్ ముల్కు ''' సహపాఠి,మిత్రుడు.నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ ప్రభువు వద్ద మంత్రిగా పనిచేసాడు.అర్సలాన్ మరణానంతరము మాలిక్ షా వద్ద మంత్రిగా పనిచేశాడు.నిజాముల్ ముల్కు గొప్ప విద్వాంసుడు,నీతివేత్త.ఈతడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' అను ప్రసిద్ధమైన పాలనాశాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్టలకు చిరంజీవం కావించెను.అంతేకాదు 'వసాయా'అను పారసీక గ్రంథాన్ని రచించెను.నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ వద్ద మంత్రిగా పనిచేయున్నప్పుడు అతని వద్దకు ఖయ్యాము వెళ్లగా,తమ పూర్వ స్నేహాన్ని మరవక,ఖయ్యాముకు రాజోద్యోగము ఇప్పించెదనని చెప్పగా,ఖయ్యాము తనకు వుద్యోగం చెయ్యుట యందు ఇఛ్చలేదని,శాస్త్రాద్యాయము చేయుచు,గ్రంథపఠనంచేయుచూవిద్యార్థులకు భోదన చేయూ ఆపేక్ష కలదనిచెప్పెను.అంతట పాదుషాకు చెప్పి సంవత్సరంకు 1200 తోమానులు ఆదాయము వచ్చు జాగీరును నిషాపూరులో ఖయ్యాముకు ఇనాముగా ఇచ్చెను.
 
ఖయ్యాముకు చిన్నతనమునుండి గణితమునందు మక్కువ ఎక్కువగా వుండెను.గణితములోని జ్యామితి,అంక(అక్షర)గణితమందు ప్రావీణ్యము సంపాదించెను.జ్యోతిశ్సాస్త్రమునందు దిట్ట.ఖయ్యాము అరబ్బీలో అక్షర గణితమును రచించెను.ఈ గ్రంథము చాలా కాలము వరకు ప్రమాణ గ్రంథముగా ఆకాలములో పరిగణింపబడినది.ఈ అరబ్బీ గ్రంథము ప్రెంచిభాషలోకి కూడా అనువాదం చెందినది.ఖయ్యాము దాతు రసాయన శస్త్రము,యూక్లిడ్ జ్యామెట్రికి వ్యాఖ్యానము,ఒక తత్వశాస్త్రము,రిబాయూతులు ఇలా అన్ని కలిపి దాదాపు తొమ్మిది గ్రంథములవరకు రచన చేసెను.వీటిలో అక్షర గణితము,రసాయన శాస్త్రము,జ్యామెట్రి వ్యాఖ్యానముల మాత్రుకలుమాతృకలు ప్యారిస్,లేడన్,ఇండియా ఆఫిసు లైబ్రరియల నందు భద్ర పరచబడినవి.
 
== సంస్మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ఖయ్యాం" నుండి వెలికితీశారు