జ్యోతి బసు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 19 interwiki links, now provided by Wikidata on d:q335284 (translate me)
పంక్తి 31:
 
== రాజకీయ జీవితం ==
ఇంగ్లాండులో ఉన్నప్పుడే జ్యోతిబసు రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1938లో [[జవహర్‌లాల్ నెహ్రూ]] [[లండన్]] పర్యటన సమయంలో సదస్సు నిర్వహణ బాధ్యతను జ్యోతిబసు చేపట్టినాడు. [[సుభాష్ చంద్రబోస్]] పర్యటన సమయంలో కూడా జ్యోతిబసు ఏర్పాట్లు చేసినాడు. స్వదేశానికి తిరిగివచ్చిన పిదప 1946లో తొలిసారిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు. [[బి.సి.రాయ్]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాడు. 1967లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజయ్ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ప్రభుత్వంలో 1967 నుండి 1969 వరకు పశ్చిమబెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. 1972లో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో జ్యోతిబసు కూడా తన శాసనసభ స్థానంలో కూడా ఓడిపోయాడు. జూన్ 21, 1977 నుండి నవంబరు 6, 2000 వరకు నిరాటంకంగా జ్యోతిబసు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. దీనితో దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును కూడా జ్యోతిబసు స్వంతంచేసుకున్నాడు.<ref>http://economictimes.indiatimes.com/news/politics/nation/Jyoti-Basu-Marxist-who-almost-became-Indias-PM/articleshow/5455143.cms</ref> సి.పి.ఐ(యం).పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. 2000లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పదవిని నుండి వైగొలిగినాడు. జనవరి 17, 2010న కోల్‌కతలో మరణించాడు.
 
== బయటి లింకులు ==
* [http://www.ganashakti.com/jb/preface.htm MEMORIES: The Ones That Have Lasted (A political autobiography) ]
"https://te.wikipedia.org/wiki/జ్యోతి_బసు" నుండి వెలికితీశారు