"పార్లమెంటు సభ్యుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
===రాజ్యసభ===
రాజ్యసభ సమాఖ్యసభ. ఇందులో 250కి మించకుండా సభ్యులుంటారు. వీరిలో 238 మంది సభ్యులు రాష్ట్రాల విధానసభలలోని ఎన్నికైన సభ్యుల ద్వారా నిష్పత్తి ప్రాతినిధ్యపు ఎన్నిక విధానంలో పరోక్షంగా ఎన్నిక అవుతారు. కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు పార్లమెంటు నిర్ణయించిన పద్ధతి ప్రకారం ఎన్నిక అవుతారు. మిగతా 12 మంది సభ్యులను సాహిత్యం, విజ్ఞానం, కళలు, సంఘసేవలలో ప్రముఖులైనవారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాష్ట్రాల జనాభాను బట్టి రాజ్యసభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు.
 
రాజ్యసభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి:
*భారత పౌరుడై ఉండాలి.
*30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవులలో ఉండరాదు.
*పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
 
కాలపరిమితి:
రాజ్యసభ శాశ్వతసభ. అంటే, ఈ సభలోని సభ్యులందరూ ఒకేమారు పదవీ విరమణ చేయరు. అందుచే, లోక్ సభ వలె ఈ సభ 5 సంవత్సరాలకొకసారి రద్దుకాదు.
 
==ఇవి కూడా చూడండి==
32,480

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867517" నుండి వెలికితీశారు