లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[దస్త్రం:DowntownLosAngeles.jpg|thumbnail|270px|లాస్ ఏంజలెస్ పాత నగరం(డౌన్‌టౌన్ )]]
లాస్ ఏంజలెస్ (లాస్ ఏంజిల్స్) [[అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లోని [[కాలిఫోర్నియా]] రాష్ట్రంలో అత్యధిక [[జనాభా]] కలిగిన నగరము. ఇది [[అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లో [[న్యూయార్క్]] తరువాత అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరము. పడమటి తీర నగరాలలో ఇది అతి పెద్దది. ఎల్.ఎ(L.A).సంక్షిప్త నామము కలిగిన ఈ పట్టణము ప్రపంచ నరరాలలో ఆల్ఫా నగరముగా గుర్తించబడినది. ఈ నగరము 469.1 చదరపు మైళ్ళ విస్తీర్ణము కల్గి [[2006]] నాటి అంచనా ప్రకారము 38,49,368 జనసంఖ్యను కల్గి ఉంది. [[కాలిఫోర్నియా]] దక్షిణ ప్రాంతంలో [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్‌ మహాసముదపు]] తీరాన ఉన్న ఈ నగరము మధ్యధరా ప్రాంతపు శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది. గ్రేటర్ లాస్ ఏంజలెస్ అనబడే నగరపాలిత ప్రాంతమైన లాస్ ఏంజలెస్, లాంగ్ బీచ్, శాంటా అన్నా ప్రాంతము లో ఒక కోటీ ముప్పది లక్షల మంది నివాసము ఉంటారు. ప్రపంచము నలుమూలల నుండి వచ్చి చేరిన ఇక్కడి ప్రజలు షుమారు నూరు విభిన్న భాషల వరకు మాట్లాడుతుంటారు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాల]] లోనే పెద్ద జిల్లా(కౌంటీ)అయిన లాస్ ఏంజలెస్ జిల్లాకు ఈ నగరము కేంద్రము. ఏంజలాన్స్ అనబడే పూర్వీకులు ఇక్కడ నివసించినట్లు గుర్తించారు. ఈ నగరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమున్న ముద్దుపేరు సిటీ ఆఫ్ ఏంజల్స్(దేవతల నగరము).
 
== నగర చరిత్ర ==
ఈ నగరము స్పానిష్ గవర్నర్ చే 1781లో కనుగొనబడినది. [[1821]]లో ఇది [[మెక్సికో]]లో ఒక భాగమైంది. అమెరికా మెక్సికన్ యుద్ధం ముగిసిన తరువాత చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇది [[1848]]లో అమెరికాలో ఒక భాగంగా మారింది. కాలిఫోర్నియా రాష్ట్ర స్థాయిని సంపాదించడానికి ఐదు నెలల ముందు [[1850]]లో దీనిని మునిసిపాలిటీగా చేసారు.
 
సంస్కృతికి, వ్యాపారానికి, సాంకేతిక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రపంచ నగరాలలో లాస్ ఏంజలెస్ కూడా ఒకటి. వ్యాపార, సాంస్కృతిక రంగాలలో ప్రముఖులైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలువురికి ఇది నివాస స్థలము. ఇక్కడ రూపొందించబడే చలనచిత్రాలు, [[టెలివిజన్]](దూరదర్శన్), మూజిక్ ఆల్బములకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.
 
లాస్ ఏంజలెస్ లో మొట్టమొదటగా టాంగ్వా, చుమాష్, నేటివ్ అమెరికన్ ల జాతులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ స్థిరపడ్డాయి. 1542లో జాయో కాబ్రిల్హో నాయకత్వములో స్పెయిన్ దేశపు దేవుని నగరముగా దీనిని పేర్కొన్నాడు. 227 సంవత్సరముల తరువాత ఆగస్ట్ 2, 1769న స్పర్ డీ పోర్టోలాతో వచ్చిన ఫ్రాన్సికన్ మిషనరీకి చెందిన జ్యాన్ క్రెస్పీ ప్రస్తుతపు లాస్ ఏంజలెస్ ప్రాంతానికి వచ్చి చేరాడు. జ్యాన్ క్రెస్పీదీనిని స్వయంపాలిత ప్రాంతం గా అభివృద్ధి చేసాడు. 1771లో వైటియర్ నేరోస్(ప్రస్తుతం శాన్ గాబ్రియల్ అని పిలుస్తారు) సమీపములో శాన్ గాబ్రియల్ ఆర్కేంజిల్ పేరుతో మిషనరీ భవనాన్ని నిర్మించాడు. 1781లో కాలిఫోర్నియా గవర్నర్ కోరికతో నూతన స్పెయిన్ వైశ్రాయి దీనిని అభివృద్ధి చేశాడు. 44 మంది సభ్యులు కలిగిన బృందం ఈ అభివృద్ధి పనిలో పాల్గొన్నది. వీరిలో ఎక్కువ శాతము ఆఫ్రికన్ జాతీయులు, స్పెయిన్, [[ఫిలిప్పీన్స్]], స్థానిక అమెరికన్లు ఉన్నారు. కొన్ని దశాభ్దాల వరకు పశువులపెంపకం, పళ్లతోటల పట్టణంగా ఈప్రాంతం కొనసాగింది.
 
ప్రస్తుతము లాస్ ఏంజలెస్ పురాతన భాగమైన ఒల్వెరా వీధిలో స్థానిక అమెరికన్ పూర్వీక సంప్రదాయక నివాసాలైన ప్యూబ్లొ నిర్మాణాలు పురాతనత్వానికి గుర్తుగా నిలిచాయి. 1821లో స్పానిష్ సామ్రాజ్యము నుండి స్వాతంత్ర్యము సంపాదించి నూతన స్పెయిన్ ఆవిర్భవించిన తదుపరి, ప్యూబ్లొ మెక్సికోలో భాగంగా కొనసాగింది. మెక్సికన్లకు అమెరికన్లకు మధ్య జరిగిన వరస పోరాటాల అనంతరం 1847, 1848లలో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా మెక్సికన్ల నుండి స్వాధీనపరచుకున్న భూభాగాన్ని కాలిఫోర్నియాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల పాలనలోకి చేర్చడంతో ఈ నగరము కూడా అమెరికాలో ఒక భాగమైంది.
 
== నగరాభివృద్ధి ==
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు