కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{ infobox person
| name = కళ్ళం అంజిరెడ్డి
Line 15 ⟶ 14:
| net_worth = (USD) $1.39 Billion
}}
 
'''కల్లం అంజిరెడ్డి''' [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] వ్యవస్థాపకుడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందిన అంజిరెడ్డి జన్మస్థలం గుంటూరు జిల్లా [[తాడేపల్లి]]. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.
 
పంక్తి 32:
అంజిరెడ్డి తండ్రి పసుపు రైతు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పసుపు పొలాల్లో తిరుగుతూ అంజిరెడ్డి అక్కడే పాఠశాల విద్య పూర్తిచేశారు. చిన్నతనంలో పుస్తకాల పురుగుకాదు. ఆటపాటల్లోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు. కాకపోతే అమోఘమైన జ్ఞాపకశక్తి ఆయనకు ఉండేది. ఒక్కసారి చూసిన, విన్న విషయాన్ని మరచిపోయేవారు కాదు. అందుకే తన తోటి విద్యార్థులు పరీక్షల్లో తప్పితే, తాను మాత్రం మంచి మార్కులు కొట్టేసేవారు. ఉన్నత విద్యాభ్యాసం 1958లో గుంటూరు ఏసీ కాలేజీలో సాగింది. అక్కడి నుంచి ఫార్మాసూటికల్స్‌ కెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్య కోసం బాంబే విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తర్వాత పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబరేటరీలో పీహెచ్‌డీ చేశారు. ఔషధ శాస్త్రవేత్తగా ఆయన రూపుదిద్దుకుంది అక్కడే. తర్వాత ఐడీపీఎల్‌లో పూర్తిస్థాయి ఔషధ నిపుణుడిగా తయారయ్యారు. ఆయన విజయప్రస్థానానికి పునాది పడింది ఐడీపీఎల్‌లోనే నని పలు సందర్భాల్లో అంజిరెడ్డి స్పష్టం చేయటం గమనార్హం.
 
తన సన్నిహితుల వద్ద, కంపెనీలో జరిగే అంతర్గత సమావేశాల్లో అంజిరెడ్డి నోటివెంట అప్రయత్నంగా వచ్చే మాట ఫైజర్‌. ప్రపంచంలో అగ్రగామి ఔషధ కంపెనీ ఫైజర్‌. అటు అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఔషధ ప్రపంచంలో ఫైజర్‌కు తిరుగు లేదు. పుణెలో నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీస్‌లో 1969లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసే సమయంలో ఫైజర్‌ ప్లాంట్‌ను చూశారాయన. అప్పుడే నిర్ణయించుకున్నారు ఫైజర్‌ లాంటి సంస్థను నిర్మించాలని. ఆ తర్వాత ఐడీపీఎల్‌ (ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌)లో ఉద్యోగంలో చేరారు కానీ ఆయనలోని పరిశోధకుడు వూరుకోలేదు. త్వరలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్త అవతారం ఎత్తారు. 1976లో యూనిలాయిడ్స్‌ అనే ఔషధ కంపెనీతో మొదలైన ప్రస్థానం 1984లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏర్పాటుతో వేగాన్ని పుంజుకుంది. అప్పుడే పేటెంట్‌ గడువు ముగిసిన ఐబూప్రూఫెన్‌ అనే నొప్పి నివారణ మందును సొంతంగా తయారు చేసి చాలా తక్కువ ధరలో ఏకంగా అమెరికాకే సరఫరా చేశారు. దాంతో విశ్వవిపణిలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సమరభేరి మోగించినట్లుయింది. తర్వాత ఇక అంజిరెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. నార్‌ఫ్లాక్సాసిన్‌, సిప్రోఫ్లాక్సాసిన్‌, వోమిప్రజోల్‌... ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలతో ఔషధ మార్కెట్‌ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని అప్రతిహతంగా ముందుకు సాగారు. తాను కంపెనీ స్థాపించే నాటికే దేశీయంగా స్ధిరపడి ఉన్న ర్యాన్‌బ్యాక్సీ, సిప్లా వంటి కంపెనీల ఆధిపత్యాన్ని అతితక్కువ సమయంలోనే సవాలు చేసే స్థాయికి ఎదిగారు. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. బిలియన్‌ డాలర్ల కంపెనీ గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించటం, విజయవంతమైన వ్యాపరవేత్తగా ఎదగటం అంత సులువైన విషయం ఏమీ కాదు. అది కూడా ఒక తరంలోనే. ఏదో సాదాసీదా కంపెనీ అంటే సరేకానీ బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని (రూ. 5,000 కోట్లకు పైనే) సంపాదించే స్థితికి ఎదగటం కొంతమంది వల్లే అవుతుంది. అటువంటి వారిలో డాక్టర్‌ అంజిరెడ్డి ఒకరు. మన రాష్ట్రం నుంచి బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎదిగిన రెండు సంస్థల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒకటి. మరొకటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌. 2005-06లో బిలియన్‌డాలర్ల టర్నోవర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ నమోదు చేసింది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత నాలుగేళ్లకే ర్యాన్‌బ్యాక్సీని అధిగమించి దేశంలో వార్షిక టర్నోవర్‌ పరంగా అగ్రగామి కంపెనీగా ఎదిగింది. మన రాష్ట్రం నుంచి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదైన తొలి కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ఒక బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎగదటానికి డాక్టర్‌ రెడ్డీస్‌కు దాదాపు పాతికేళ్లు పడితే, ఆతర్వాత రెండు బిలియన్‌ డాలర్ల కంపెనీ కావటానికి మాత్రం ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. 2012 నాటికే రెండు బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయం స్థాయిని అధిగమించి ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతోంది. 5 బిలియన్‌ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేయటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఎంతో దూరంలో లేదనే విశ్లేషణలు ఉన్నాయి.
బిలియన్‌ డాలర్ల కంపెనీ
గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించటం, విజయవంతమైన వ్యాపరవేత్తగా ఎదగటం అంత సులువైన విషయం ఏమీ కాదు. అది కూడా ఒక తరంలోనే. ఏదో సాదాసీదా కంపెనీ అంటే సరేకానీ బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని (రూ. 5,000 కోట్లకు పైనే) సంపాదించే స్థితికి ఎదగటం కొంతమంది వల్లే అవుతుంది. అటువంటి వారిలో డాక్టర్‌ అంజిరెడ్డి ఒకరు. మన రాష్ట్రం నుంచి బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎదిగిన రెండు సంస్థల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒకటి. మరొకటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌. 2005-06లో బిలియన్‌డాలర్ల టర్నోవర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ నమోదు చేసింది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత నాలుగేళ్లకే ర్యాన్‌బ్యాక్సీని అధిగమించి దేశంలో వార్షిక టర్నోవర్‌ పరంగా అగ్రగామి కంపెనీగా ఎదిగింది. మన రాష్ట్రం నుంచి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదైన తొలి కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ఒక బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎగదటానికి డాక్టర్‌ రెడ్డీస్‌కు దాదాపు పాతికేళ్లు పడితే, ఆతర్వాత రెండు బిలియన్‌ డాలర్ల కంపెనీ కావటానికి మాత్రం ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. 2012 నాటికే రెండు బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయం స్థాయిని అధిగమించి ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతోంది. 5 బిలియన్‌ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేయటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఎంతో దూరంలో లేదనే విశ్లేషణలు ఉన్నాయి.
 
===కొత్త ఔషధాల రూపకల్పన===
Line 59 ⟶ 57:
* [[1998]] లో సేవాకార్యక్రమాలు ప్రారంభించిన రెడ్డీస్ సంస్థ మొదటగా [[నాంది]] పౌండేషన్ ప్రారంభించి కొన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నది.
* రెడ్డీస్ అనుబంద సంస్థ హ్యూమన్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
 
 
==చివరి రోజులు==
Line 64 ⟶ 63:
 
ప్రస్తుతం కుమారుడు సతీష్‌రెడ్డి కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, అల్లుడు జి.వి.ప్రసాద్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు