కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

5,233 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
పంక్తి 62:
* సర్వేశ్వర మహాదేవ మందిరం. కురుక్షేత్ర సరోవరం మధ్యభాగంలో ఉన్న సర్వేశ్వర మహాదేవ మందిరం చేరుకోవడానికి చిన్నపాటి వంతెన నిర్మితమై ఉన్నది. బాబా శ్రవణ్ నాధ్ నిర్మించిన ఈ మందిరంలో ఐదు శిఖరాలతో కూడిన ఐదు మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయంలో శివలింగం, శివ, పార్వతి, గణపతి, నంది విగ్రహాలు ఉంటాయి. మరొక భాగంలో నారాయణుడు, గరుత్మంతుడు ఉండగా ఇతర భాగాలలో హనుమాన్, మాహామాయ, రాఫ్హాక్రిష్ణుల విగ్రహాలు ఉంటాయి. కుంతీదేవి ఈ మందిరంలో శివుని స్వర్ణకమలాలతో పూజించిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
* గోరక్షనాధ్ మందిరం. బ్రహ్మసరోవరం ఎదుట గోరక్షనాధుని మందిరం ఉంది. నాధ సంప్రదాయం అనుసరించి మందొరంలో గురుగోరక్షనాధుడి విగ్రహం ఉంది. ఇక్కడ యాత్రికులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. గ్రహణ సమయాలలో స్నానం ఆచరించడానికి వచ్చే సాధువులు అనేకమంది ఇక్కడ విశ్రమిస్తుంటారు.
* జయరాం విద్యా అందిరంమందిరం. ఇది బ్రహసరోవర తీరలో ఉన్న గీతాభవనం, గుడియా మఠం మద్యన ఉన్నది. సుందరమైన ఈ భవనాన్ని దేవేంద్రస్వరూప్ భ్రహ్మచారి నిర్మించాడు.
ఇక్కడ దశావతారాల పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ భజనలు, కీర్తనలు, ఇక్కడ హ్మకుండంలో హోమాలు జరుగుతుంటాయి. మందిరప్రవేశద్వారానికి ఇరువైపులా విష్ణుమూర్తి, భీష్మపితామహుల ప్రయిమలు ఉంటాయి. ఈ మందిరంలో ఒకప్పుడు వేదపఠనం జరిగేది. ఇక్కడ సంస్కృత పాఠశాల కూడా ఉంది.
* చంద్రకూపం :- కురుక్షేత్ర సరోవర మధ్యభాగంలో ఉన్న పురుషోత్తమ పురంలో ఉన్న అతి ప్రాచీన ప్రదేశం చంద్రకూపం (బావి). ఈ కూపాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కూపానికి సమీపంలో ఉన్న మందిరంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు ఒక స్ర్హంభం పాతాడని అది కాలగర్భంలో కలీపోయింది కనుక ప్రస్థుతం లేదని కథనాలు వివరిస్తున్నాయి. యాత్రీకులు ఇక్కడ గుప్తదానాలు చేస్తూ ఉంటారు.
* గితా భవనం :- రాజభనం మాదిరిగా ఉన్న ఈ గీతభవనాన్ని రేవారాజు 1921లో నిర్మించాడని కథనాలు వివరిస్తున్నాయి.
* బిర్లా మందిరం :- కురుక్షేత్ర సమీపంలో పహావారోడ్డుకు సమీపంలో ఉన్న బిర్లామందిరాన్ని 1952లో శ్రీజుగల్ కిశోర్ బిర్లా నిర్మించాడు. భగవత్దీగీతా మందిరమని పిలువబడే ఈ మందిరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సుందరమైన వుగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మందిరం గోడలమీద భగవద్గీత శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. మందిరానికి ఉత్తరభాగాన నాలుగు గుర్రాలతో ఒక రాతిరథం నిర్మించబడి ఉంది. రథం మద్యలో కృషార్జనుల విగ్రహాలు ప్రతిష్తిచే పని మిగిలి ఉంది.. రథానికి నాలుగు వైపులా బగవద్గీతలోని ముఖ్యమైన నాలుగు శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి.
* స్థానేశ్వర మందిరం :- థానిసర్ పట్టణానికి షుమారు రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఈ మందిరానికి సమీపంలో ఉన్న సరోవరంలో మహిళల కొరకు ప్రత్యేక స్నానఘట్టం ఉంది. ఈ సరోవర స్నాం సకల కోరికలు తీర్చగలదని,, ఘోర పాపాలను హరింస్తుందని, స్థాణు లింగ దర్శనం స్పర్శ ముక్తిని ఇస్తుందని, తెలియక చేసిన పాపాలు స్థాణు లింగ దర్శనంతో పటాపంచలౌతాయని , వేన మహారాజు ఈ సరోవర జలస్పర్శతో సకలపాపాల నుండి విముక్తిడయ్యాడని, మహాభారత యుద్ధానికి ముండే శ్రీకృష్ణుడు స్థానేశ్వరుని దర్శించాడని కథనాలు వివరిస్తున్నాయి. స్థానేశ్వర దర్శనం చెయ్యకపోతే కురుక్షేత్ర యాత్ర నిష్ఫలమని కథనాలు వివరిస్తున్నాయి.
* కాళేశ్వర మందిరం : - స్థానేశ్వర మందిరానికి వెళ్ళే మార్గంలో ఉన్న పురాతన శివాలయమిది. ఇక్కడ ఉన్న తీర్థంలో మాఘమాసంలో స్నానం ఆచరిస్తే విశేషఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
స్థాణుతీర్ధానికి దక్షిణాన ఉన్న ఈ లింగం సర్వపాపహరమని, ఈ లింగ దర్శనం అగ్నిషోమ హోమఫలం ఇస్తుందని విశ్వసించబడుతుంది. ఇక్కడ రావణుడు రుద్రుని స్థాపించాడని చెప్తారు. ఇక్కడి లింగాన్ని కంకారూపి మహారుద్రుడు స్థాపించాడు.
* భద్రకాళీ మందిరం :-
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
64,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/932752" నుండి వెలికితీశారు