అంగ్ సాన్ సూకీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
'''ఆంగ్ సాన్ సూకీ''' 1945 జూన్ మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె [[బర్మా]]లో ప్రముఖ రాజకీయవాది మరియు "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి)చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.
 
సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో మరియు షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో [[నోబుల్ shanti బహుమతి]] అందుకున్నది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్ లాల్ పురస్కారం ఇచ్చింది.[[వెనుజులా]] ప్రభుత్వం ఆమెకు " సైమన్ బోలీవర్ " పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లో [[కెనడా]]
ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. కెనడా నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబర్ 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది.ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.
 
"https://te.wikipedia.org/wiki/అంగ్_సాన్_సూకీ" నుండి వెలికితీశారు