ద్రాక్షారామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
=== భీమేశ్వరాలయం ===
ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువు గా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందొంది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.
=== అష్ట లింగాలు ===
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని విశ్వసించబడుతుంది.తూర్పున [[కోలంక]] ,పడమర [[వెంటూరు]],'దక్షిణాన [[కోటిపల్లి]] ఉత్తరాన [[వెల్ల]] ఆగ్నేయంలో [[దంగేరు]]. నైరుతిలో [[కోరుమిల్లి]]'వాయువ్యంలో [[సోమేశ్వరం]] ఈశాన్యాన [[పెనుమళ్ళ]] ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర మరియు కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు ,పశ్చిమ ,ఉత్తర , దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.
 
===స్థలపురాణం===
"https://te.wikipedia.org/wiki/ద్రాక్షారామం" నుండి వెలికితీశారు