ముక్కోటి ఏకాదశి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 12:
===వైఖానసుడి కథ===
[[పర్వతమహర్షి]] సూచనమేరకు [[వైఖానసుడు|వైఖానసుడనే]] రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
ఖా
 
===మురాసురుడి కథ===
[[కృతయుగం|కృతయుగంలో]] ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. [[విష్ణువు]] మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని [[మురాసురుడు]] మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే [[మహాలక్ష్మి]] [[దుర్గ]] రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
"https://te.wikipedia.org/wiki/ముక్కోటి_ఏకాదశి" నుండి వెలికితీశారు