కీటక సంహార పరికరాలు

కీటక సంహార పరికరాలు కీటకాలను సంహరించుటకు మానవుడు తయారుచేసుకున్న పరికరాలు. పురాతన కాలం నుండి మానవునికి కీటకాల నుండి హాని కలుగుతున్నది. వీటి బారినుండి రక్షించుకునుటకు వీటి తయారీని ప్రారంభించాడు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వివిధ పరికరాలను తయారు చేసుకున్నాడు. వీటిలో కొన్ని పరికరాలు మిక్కిలి ప్రాచుర్యం పొందినవి.

దోమల సంహారిణులు మార్చు

దోమలను చంపడానికి వాడే బ్యాట్ 21వ శతాబ్దంలో వచ్చిన ఓ సృజనాత్మక పరికరం. మామూలు బ్యాట్‌ల్లోలా కాకుండా ఇందులో రెండు పొరలుగా ఉండే అల్లిక ఉంటుంది. ఇవి అల్యూమినియం లేదా రాగి తీగల్తో అల్లి ఉంటాయి. ఇందులో ఒక జల్లెడలాంటి పొరకు ధనావేశం, మరో జల్లెడలాంటి పొరకు రుణావేశం అందేలా బ్యాట్‌పిడిలో ఉండే బ్యాటరీకి సంధానం చేస్తారు. పిడి మీద ఉన్న ఓ స్ప్రింగ్ స్విచ్‌ను నొక్కినపుడు మాత్రమే ఆ జల్లెడలకు విద్యుత్ అందుతుంది. అయితే ఈ రెండు పొరలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా దగ్గరగా, సమాంతరంగా ఉండడం వల్ల స్విచ్ నొక్కినా విద్యుత్ ప్రవహించదు. ఇలాంటి సమయంలో స్విచ్ నొక్కి దోమల్ని కొడితే ఆ దోమలు రెండు జల్లెడల మధ్య చిక్కుకుని రెండు ధ్రువాల్ని కలుపుతాయి. దాంతో దోమ గుండా విద్యుత్ ప్రవహించి మాడిపోతుంది.

ఈగల సంహారిణులు మార్చు

బయటి లంకెలు మార్చు