శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు లక్షణ[1]. ఈమె బృహత్సేనుని కూతురు.[2] ఈమె నారదుని ద్వారా శ్రీకృష్ణుడి గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం తెలుసుకుంటుంది. ఈమె శ్రీకృష్ణునుని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఈమె తండ్రి మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికే తన కూతురుని ఇస్తానని చాటిస్తాడు, అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక శ్రీకృష్ణుడు మత్స్యాన్ని పడేస్తాడు. ఈ విధంగా లక్షణకు శ్రీకృష్ణునుని పెళ్ళి చేసుకోవాలనుకున్న కోరిక సిద్ధిస్తుంది.[3]

లక్ష్మణ
మహాభారతం పాత్ర
అష్టమహిషులతో కృష్ణుడు - 19వ శతాబ్దంలోని మైసూరులోని చిత్రపటం.
సమాచారం
దాంపత్యభాగస్వామికృష్ణుడు

లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.

మూలాలు మార్చు

  1. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. p. 62. ISBN 978-0-8426-0822-0.
  2. Charya, M. N. (2020-09-10). "శ్రీకృష్ణుని అష్టభార్యలు... ఆసక్తికర విషయాలు". telugu.oneindia.com. Retrieved 2021-04-14.
  3. "రారా కృష్ణయ్య..!". Sakshi. 2019-08-18. Retrieved 2021-04-14.
"https://te.wikipedia.org/w/index.php?title=లక్షణ&oldid=3811102" నుండి వెలికితీశారు