లినక్సు ఫార్మటు

లినక్సు ఫార్మటు, ఇది బ్రిటన్ దేశపు మొదటి లినక్సు పత్రిక! అంతే కాకుండా బ్రిటనులో ఇది ప్రస్తుతము అత్యధికంగా అమ్ముడవుతున్న పత్రిక. ఒక్క బ్రిటను మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు.

Linux Format
సంపాదకులుNeil Mohr
వర్గాలుLinux
తరచుదనం13 per year
ముద్రించిన కాపీలు19,000 Jan-Dec 2014
మొదటి సంచిక2000; 24 సంవత్సరాల క్రితం (2000)
సంస్థFuture plc
దేశంUnited Kingdom
భాషEnglish
ISSN1470-4234

ఈ పత్రికలో కూడా ఇతర కంప్యూటరు పత్రికలలాగానే అన్ని విషయాలూ ఉంటాయి, కానీ ఇవి లినక్సు వినియోగదారులకోసం ప్రత్యేకంగా వ్రాస్తారు. ఇందులో సమీక్షలు, సాంకేతిక విషయాలు, ట్యుటోరియల్లు మొదలైనవి ఉంటాయి. ఈ పత్రికలో వ్యాసాలు అన్ని స్థాయిలలోని వినియోగదారుల కోసం వ్రాస్తారు.

ఈ పత్రిక ప్రతి సంవత్సరం పదమూడు పర్యాయములు ప్రచురిస్తారు. పత్రికతో పాటూ ఒక సీడీ లేదా డీవీడీ వస్తుంది. ఈ సీడీలలో ఏదో ఒక పంపిణీ లినక్సు వస్తుంది.

ఈ పత్రిక ఫ్యూచర్ పబ్లిషింగు వారు ప్రచురిస్తున్నారు. ఇది 1999 లో ప్రారంభమయిన ఈ పత్రికను ఇటాలియన్, గ్రీకు, రష్యన్ భాషలలోకి తర్జుమా కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు