ప్రపంచంలోనే అతి పెద్ద గొడ్డలి

ప్రపంచంలోనే అతి పెద్ద గొడ్డలి (World's largest axe) నాకేవిక్, న్యూ బ్రున్స్విక్, కెనడాలో ఉంది.[1]గొడ్డలి 15 మీటర్ల (49 అడుగులు) పొడవు, 55 టన్నుల బరువు ఉంటుంది. గొడ్డలి తల 7 మీటర్ల (23 అడుగులు) వెడల్పు ఉంటుంది. దీని కాంక్రీటు స్టంప్ వ్యాసం 10 మీటర్లు (33 అడుగులు). ఇది 1991లో కెనడాలోని వుడ్‌స్టాక్ పట్టణంలోని ఒక కంపెనీచే రూపొందించబడి నిర్మించబడింది. ఈ గొడ్డలి తల భాగంలో దీని ప్రారంభ సమయ శిలాఫలకం ఇమడ్చబడివుంది.[2]

ప్రపంచంలోనే అతి పెద్ద గొడ్డలి
2005 లో గొడ్డలి, ఉద్యానవనం

ఈ భారీ గొడ్డలి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో అడవుల ప్రాముఖ్యతను సూచిస్తుంది.[3]

మూలాలు

మార్చు
  1. "Town of Nackawic - Home of the World's Largest Axe". Retrieved 2009-04-05.
  2. "World's Largest Axe". Tourism New Brunswick. Archived from the original on 30 అక్టోబరు 2012. Retrieved 6 June 2012.
  3. Plaque