ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం

ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం (ప్రపంచ పెరటి తోటల దినోత్సవం) ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలోని ఆఖరి ఆదివారం నాడు జరుపుకుంటారు. ఆరోగ్యపరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సేంద్రియ ఇంటిపంటల మేలు గురించి ప్రచారం చేయడంకోసం ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]

ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం
జరుపుకొనేవారుఅంతర్జాతీయంగా
ప్రారంభంఆగస్టు నెల చివరి అదివారం
ఆవృత్తివార్షికం
పెరటి తోట

వివరాలు మార్చు

ఈ దినోత్సవంను బహిరంగంగా కాకుండా ఎవరి ఇంట్లో వాళ్ళే జరుపుకుంటుంటారు. పట్టణాలలోను, నగరాలలోను కొంతమంతి ఎవరికి కావాల్సిన కూరగాయలను, ఆకుకూరలను వారి ఇంటిలోనే పండించుకుంటున్నారు. పొలాల్లో పండించే ఆహారోత్పత్తి పరిమాణంతో పోల్చితే ఇంటిపంటల ఆహోరోత్పత్తి పరిమాణం కొంచెమే అయినా విష రసాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరల కోసం పేద, మధ్య, ఉన్నత వర్గాలకు చెందిన అందరూ వీలైనంతగా ఇంటిపంటలు పండిస్తున్నారు.

లక్ష్యాలు మార్చు

  1. స్థానికంగా పండించే ఆహారాన్నే ఎక్కువగా తినడం వల్ల దూర ప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించడానికయ్యే వ్యయాన్ని/కాలుష్యాన్ని తగ్గించడం
  2. ఇంటిపంటల పెంపకం, పోషకాలు నష్టపోని విధంగా వంట చేయడాన్ని ప్రపంపవ్యాప్తంగా ప్రచారంలోకి తేవడం

మూలాలు మార్చు

  1. సాక్షి, వంట-పంట (23 August 2014). "..ఇప్పటి ట్రెండ్!". Sakshi. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.
  • సాక్షి దినపత్రిక - 23-08-2014 - (..ఇప్పటి ట్రెండ్! ఇంటిపంట - ఈ నెల 24న "అంతర్జాతీయ ఇంటిపంటల దినోత్సవం" సందర్భంగా..)