ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న నిర్వహించబడుతోంది. చర్మ క్యాన్సర్ (లింఫోమా) పై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచంలోని 52 దేశాలలోని చర్మ క్యాన్సర్ రోగులకు సంబంధించిన 83 సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి.

ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
ప్రారంభం2004
జరుపుకొనే రోజుసెప్టెంబరు 15
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

చరిత్ర

మార్చు

రోగ లక్షణాలను గుర్తించడానికి, రోగ నిర్ధారణలు చేయడానికి, చికిత్సపరంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి 2004లో ఈ దినోత్సవం ప్రారంభించబడింది.[1] 2004లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించినప్పటి నుండి, అర్జెంటీనాలో కళా ప్రదర్శనలు, ఫ్రాన్స్‌లో బైక్ ర్యాలీలు, న్యూజిలాండ్‌లో సెమినార్లు వంటి వివిధ కార్యక్రమాలతో ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవంకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి రోగులు, వారి కుటుంబాలకు చర్మ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాల గురించి తెలిపి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రజల జీవితాలను ఈ వ్యాధి ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతోంది.[2][3]

ఇతర వివరాలు

మార్చు

చర్మ క్యాన్సర్ నిరంతరం పెరిగే[4][5] ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ మంది ప్రజలు ఈ చర్మ క్యాన్సర్ బారిన పడ్డారు.[6] ప్రతిరోజూ దాదాపు 1,000 మంది కొత్తవారికి ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్టు నిర్ధారణ అవుతోంది, అయితే చర్మ క్యాన్సర్ గురించిన సంకేతాలు, లక్షణాల గురించిన ప్రచారం చాలా తక్కువ ఉంది.[7]

మూలాలు

మార్చు
  1. Λούβρου, Κωνσταντίνου (14 September 2018). "Τι είναι το λέμφωμα και ποια τα συμπτώματα;". Agrinio Press (in Greek). Greece. Archived from the original on 21 ఏప్రిల్ 2019. Retrieved 15 September 2020.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "Pasaulinė limfomos žinomumo diena - ir Lietuvoje". Vakary ekspresas (in Lithuanian). Klaipėda, Lithuania. 14 September 2009. Retrieved 15 September 2020.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. Al-Ani, Manal (13 September 2017). "World Lymphoma Awareness Day". SBS Radio Arabic24. Australia. Retrieved 15 September 2020.
  4. World Health Report 200, World Health Organization, www.who.int
  5. Jones, Jacqui (15 September 2012). "World Lymphoma Awareness Day". Newcastle Herald. Newcastle, New South Wales, Australia. Retrieved 15 September 2020.
  6. GLOBOCAN 2002: Descriptive Epidemiology Group of the International Agency for Research on Cancer (IARC)
  7. Boshomane, Pearl (15 September 2011). "Today is World Lymphoma Awareness Day". Sunday Times. Johannesburg, South Africa. Retrieved 15 September 2020.