ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం
ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం ఆగస్టు 19 న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. లూయిస్ డాగ్యురే అభివృద్ధి చేశారు.[1]ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్‌లను ఏకం చేయడానికి మరింత మందిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19 న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు.[2][3]
ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | ఆగస్టు 19 |
ఉత్సవాలు | ఆగస్టు 19 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
చరిత్ర
మార్చుఫోటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుండి వచ్చింది. ఫొటో అంటే కాంతి, గ్రాఫి అంటే తీసుకోవడంం. ప్రపంచ ఫోటో దినోత్సవం, దీనిని 19 ఆగష్టు 1910న మొదటగా జరుపుకున్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం డాగ్యురో అనే శాస్త్రవేత్త ఆవిష్కరణల నుండి ఉద్భవించింది[4][5]. ఫ్రెంచ్‌దేశానికి చెందిన లూయిస్ డాగ్యురే, జోసెఫ్ నైస్‌ఫోర్ నీప్ప్ అభివృద్ధి చేసిన ఫోటోగ్రఫీ ప్రక్రియల గురించి 1839 జనవరి 9న ఫెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యూరే టైప్ ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది.తర్వాత కొద్దినెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పెటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ఏటా ఆగస్టు 19ని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుతున్నారు.[6]
భారతదేశంలో ఫోటోగ్రఫీ
మార్చుఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుంచి దేశంలో ప్రతియేటా ఆగస్టు 19న ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపడం ప్రారంభించింది. మనదేశంలో 1840లోనే ఫోటోగ్రఫీ కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మొట్ట మొదటిగా కలకత్తాలో కేలోటైపు మొదటి ఫొటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. ఇప్పటికి 8 చౌరంగీరోడ్డు కల కత్తాలో నిల్చి ఉన్నది.1854లో ఫొటో గ్రాఫిక్ సొసైటీ ఆఫ్ బాంబే స్థాపించబడింది. మనదేశంలో ఇది మొట్టమొదటి ఫొటోక్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్పు చెందింది. అప్పట్లో కేవలం బ్రిటీష్‌రాజు, జమిందారులకు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. 1877 నుంచి ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది.[7]
ఫొటోగ్రఫీ కోర్సులు
మార్చుజేఎన్టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వెంకటేశ్వర ఫైనార్ట్స్ కళాశాల, లకోటియా ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫొటోగ్రఫీలో శిక్షణనిస్తున్నారు. వీటిలోనే కాకుండా పలు ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో కూడా ఫొటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నారు. ఫొటోగ్రఫీ నాలుగేళ్ల కోర్సులో ఎనిమిది సెమిస్టర్లుంటాయి. 30 సీట్లను ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.ఫ్యాషన్, పారిశ్రామిక, పర్యాటక, ట్రావెల్, జర్నల్‌లకు సంబంధించి ఫొటోగ్రఫీ, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో కూడా శిక్షణ ఉంటుంది.ఫొటోగ్రఫీలో ఒకప్పుడు పురుషులు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ రంగంపై మక్కువ కనబరుస్తున్నారు.[8]
మూలాలు
మార్చు- ↑ "World Photography Day". The Hindu (in Indian English). 2013-08-18. Retrieved 2021-08-19.
- ↑ "Clickety click: Here's why August 19 is observed as World Photography Day". The Economic Times. Retrieved 2021-08-19.
- ↑ "BBC Four - Britain in Focus: A Photographic History". BBC (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-08-19.
- ↑ "World Photography Day 2021: History Of Photography And Camera". NDTV.com. Retrieved 2021-08-19.
- ↑ "ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే". www.sakshieducation.com. Archived from the original on 2021-08-19. Retrieved 2021-08-19.
- ↑ "International Photography Day History 2021: Significance and All You Need to Know". News18 (in ఇంగ్లీష్). 2021-08-19. Retrieved 2021-08-19.
- ↑ "డబ్బా సైజు నుంచి.. డిజిటల్ వరకు". m.andhrajyothy.com. Archived from the original on 2021-08-19. Retrieved 2021-08-19.
- ↑ Reporter, Staff (2020-04-30). "Nikon launches online photography classes". The Hindu (in Indian English). Retrieved 2021-08-19.