ప్రపంచ పర్యాటక దినోత్సవం

పర్యాటకంపై అవగాహన పెంచేందుకు ఏటా జరిపే దినోత్సవము

ప్రపంచ పర్యాటక దినోత్సవమును ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27న జరుపుకుంటారు. 1980 నుండి ఐ.రా.స ప్రపంచ పర్యాటక సంస్థ ఈ వేడుకలను సెప్టెంబరు 27 న నిర్వహిస్తుంది. ఈ తేదీని 1970 లో ఒక రోజున ఎంపికచేశారు. UNWTO విధానాలననుసరించి ఈ రోజును స్వీకరించడం జరిగింది. ఈ విధానాన్ని అవలంబించడాన్ని ప్రపంచ పర్యాటకంలో ఒక మైలురాయిగా భావిస్తారు. ఈ రోజు యొక్క ఉద్దేశం అంతర్జాతీయ సమాజంలో పర్యాటక పాత్ర మీద అవగాహన పెంచడం, అది ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ఎలా ప్రభావితం చేసిందో చూపటం. 1997 అక్టోబరులో ఇస్తాంబుల్, టర్కీలో జరిగిన UNWTO సర్వ ప్రతినిధి సభ పన్నెండవ సమావేశంలో, ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో సంస్థ భాగస్వామిగా వ్యవహరించడానికి ఒక ఆతిథేయ దేశాన్ని కేటాయించాలని నిర్ణయించబడింది.

ప్రపంచ పర్యాటక స్థలాలు- ఐక్యరాజ్య సమితి