ప్రపంచ పొదుపు దినోత్సవం

ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 30న నిర్వహిస్తారు. సామాన్య పౌరులకి పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.

పొదుపును గురించి తెలియచేసే చిత్రం

చరిత్రసవరించు

1924లో ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన మొదటి అంతర్జాతీయ పొదుపు సమావేశంలో అక్టోబర్‌ 30ని ప్రపంచ పొదుపు దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా వున్న బ్యాంక్యులన్ని ప్రపంచ పొదుపు దినోత్సవంని జరుపుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రపంచమంతా ‘ఇంటర్నేషనల్‌ సేవింగ్స్‌ బ్యాంక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ కి చెందిన 940 సేవింగ్స్‌ బ్యాంక్స్‌ క్రియాశీలకంగా, నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాయి. భారత దేశంలో అక్టోబర్‌ 30న ఈ పొదుపు దినోత్సవం జరుపుకుంటారు. పొదుపు స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పొదుపు చేయడానికి అర్హులే. అయితే పొదుపు అనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది. విద్యుత్, నీటిని, ఆహారాన్ని, అనవసరంగా వృధా చేయకుండా పొదుపు చేసే ఉద్దేశంతో ఈ దినోత్సవం ప్రారంభించారు.[1]

మూలాలుసవరించు

  1. ప్రజాశక్తి, ఎడిటోరియల్ (29 October 2019). "పొదుపు చేద్దాం". www.prajasakti.com. నెరుపటి ఆనంద్‌. Archived from the original on 30 అక్టోబర్ 2019. Retrieved 30 October 2019. Check date values in: |archivedate= (help)