ప్రపంచ పోటీతత్వ సూచీ - 2023

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ( ఐ ఎం డి ) 2023 సంవత్సరానికి గాను ప్రపంచ పోటీ తత్వ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం 2023 సంవత్సరానికి 40 వ స్థానంలో నిలిచింది[1]. 2022 సంవత్సరంలో 37వ స్థానంలో నిలిచిన భారతదేశ ఈ ఏడాది మూడు స్థానాలు దిగజారి 40వ స్థానం దక్కించుకుంది[2]. తాజా నివేదికల ప్రకారం ... భారతదేశ తన సమర్త్యాన్ని మెరుగుపరుచుకున ఇతర దేశాలతో పోలిస్తే వ్యాపార సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రదర్శన వంటి వాటిలో కొంత వెనుకబడి ఉంది. మారకం రేటు స్థిరత్వం, పరిహారం స్థాయిలు, కాలుష్య నియంత్రణలో మెరుగుదల వంటివి భారత స్కోర్ లో సాయపడ్డాయి. ప్రపంచ పోటీ తత్వ జాబితాలో 2023 సంవత్సరానికి డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవగా, ఐర్లాండ్ రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ మూడో స్థానంలో నిలిచాయి[3].

మూలాలు :

  1. "Singapore falls one spot to 4th in 2023 global competitiveness index, India ranks 40th". The Economic Times. 2023-06-26. ISSN 0013-0389. Retrieved 2023-09-19.
  2. "world competitiveness index: Latest News & Videos, Photos about world competitiveness index | The Economic Times - Page 1". The Economic Times (in ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
  3. Editor, Insights (2023-06-29). "2023 Global Competitiveness Index". INSIGHTSIAS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19. {{cite web}}: |last= has generic name (help)