ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
అంతర్జాతీయ శెలవు, జూన్ 12 వ తేదీన
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.[1][2]
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | World Day Against Child Labour (WDACL) |
జరుపుకొనేవారు | ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు |
ప్రాముఖ్యత | బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని ప్రతి యేటా నిర్వహిస్తున్నారు. |
జరుపుకొనే రోజు | జూన్ 12 |
వేడుకలు | ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రారంభం
మార్చుబాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ప్రారంభించింది.
లక్ష్యాలు
మార్చు- అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం.[3]
కార్యక్రమాలు
మార్చుప్రతి సంవత్సరం జూన్ 12న, బాల కార్మికుల దుస్థితిని హైలైట్ చేసి వారికి ఏమి సహాయం చేయవచ్చో చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రభుత్వాలు, యజమానులు, కార్మికుల సంస్థలు, పౌర సమాజం, అలాగే లక్షలాది ప్రజలను ఏకవేదిక మీదికి తెస్తుంది.
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, మహబూబ్ నగర్ (12 June 2017). "బాల్యం.. ఛిద్రం!". Archived from the original on 12 June 2019. Retrieved 12 June 2019.
- ↑ సాక్షి, జాతీయం (12 June 2016). "బలవుతున్న బాల్యం." Archived from the original on 12 June 2019. Retrieved 12 June 2019.
- ↑ https://www.jagranjosh.com/current-affairs/telugu-world-day-against-child-labour-observed-globally-1434352618-3