ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1]

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్య సమితి
ప్రారంభం2007 (ఆమోదం), 2009 (ప్రారంభం)
జరుపుకొనే రోజుఫిబ్రవరి 20
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

చరిత్ర మార్చు

పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను అధిగమించడానికి చేయవలసిన కృషికోసం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకోవాలన్న ప్రతిపాదనను 2007, నవంబరు 26న జరిగిన ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, ఎ/ఆర్ఈఎస్/62/10 పై తీర్మానించగా 2009, ఫిబ్రవరి 20న తొలిసారిగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపబడింది.[2][3]

విధులు మార్చు

  1. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తించి పేదరికం, లింగ సమానత్వం, నిరుద్యోగం, మానవ హక్కులు, సామాజిక రక్షణ వంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం
  2. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య స్నేహ బాంధవ్యాలు ఏర్పాటుచేయడం, సామరస్య వాతావరణం సాధించడం, వివిధ దేశాలమధ్య సమాన ప్రాతిపదికపై సంబంధాలు నెలకొల్పడం
  3. విలువలు, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, భద్రత, ఆర్థిక సామాజిక పురోభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఎటువంటి వివక్షత పాటించకుండా సామాజిక న్యాయం అమలయ్యేలా చూడడం[4]

కార్యక్రమాలు మార్చు

  1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్థలు ఈ దినోత్సవం రోజున సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన కొరకు ప్రచారం చేస్తాయి. సెమినార్లు, సమావేశాలు జరుగుతాయి. పేదలకు సహాయం చేయడానికి నిధులు సేకరించబడతాయి.
  2. సామాజిక న్యాయం యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు బోధించడానికి అనువైన విషయాలలో పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలు ప్రధానమైనవి.
  3. దేశాల వారిగా వివిధ రకాల బోధన విషయాలు ఐక్యరాజ్య సమితి వద్ద అందుబాటులో ఉన్నాయి.[5][6][7]

మూలాలు మార్చు

  1. "World Day of Social Justice, 20 February". www.un.org (in ఇంగ్లీష్). Retrieved 20 February 2020.
  2. UN declares 20 February as World Day of Social Justice
  3. నవతెలంగాణ, నేటివ్యాసం (20 February 2016). "న్యాయ సాధనలో సామాజిక న్యాయం ఏపాటిది?". దడాల సుబ్బారావు. Archived from the original on 20 February 2020. Retrieved 20 February 2020.
  4. ప్రజాశక్తి, ఎడిటోరియల్ (20 February 2016). "సన్నగిల్లుతున్న సామాజిక న్యాయం". దడాల సుబ్బారావు. Archived from the original on 20 ఫిబ్రవరి 2020. Retrieved 20 February 2020.
  5. "United Nations Matters lesson plans - by UNA-UK". Guardian Teacher Network (in ఇంగ్లీష్). 2013-09-04. Archived from the original on 20 ఫిబ్రవరి 2018. Retrieved 20 February 2020.
  6. "Power-shift power point (secondary) – Oxfam's Food for Thought project". Guardian Teacher Network (in ఇంగ్లీష్). 2011-12-23. Archived from the original on 20 ఫిబ్రవరి 2018. Retrieved 20 February 2020.
  7. Hannah, Valerie (2014-02-17). "How to teach … social justice". the Guardian (in ఇంగ్లీష్). Retrieved 20 February 2020.