ప్రపంచ సైకిల్ దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది

Thumbnail

ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1]

ప్రపంచ సైకిల్ దినోత్సవం
ప్రపంచ సైకిల్ దినోత్సవం
ప్రపంచ సైకిల్ దినోత్సవ లోగో
ప్రారంభం2018
జరుపుకొనే రోజుజూన్ 3
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

చరిత్ర మార్చు

ప్రపంచ సైకిల్‌ దినోత్సవం కోసం 2016వ సంవత్సరం నుంచి ప్రపంచ సైక్లింగ్‌ అలయెన్స్‌ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్‌ సమాఖ్య (ఈసీఎఫ్‌)లు ఐక్యరాజ్య సమితిని విజ్ఞప్తి చేశాయి. 2018, ఏప్రిల్ 12న న్యూయార్క్‌లో 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సదస్సులో ఈ తీర్మానాన్ని ఆమోదించబడింది.[2]

ప్రారంభం మార్చు

ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితికి అందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కి చెందిన ప్రొఫెసర్ లెస్జెక్ సిబిల్స్కి తన సోషియాలజీ తరగతితో కలిసి ఈ దినోత్సవ ప్రచారానికి నాయకత్వం వహించాడు. తుర్కమేనిస్తాన్ దేశంతోసహా 56 దేశాలు మద్దతు ఇచ్చాయి.[3][4][5]

ఐక్యరాజ్య సమితి లోగోలోని నీలం, తెలుపు రంగులతో ప్రపంచ సైకిల్ దినోత్సవ లోగోని ఐజాక్ ఫెల్డ్ రూపొందించాడు. ప్రొఫెసర్ జాన్ ఇ. స్వాన్సన్ యానిమేషన్ చేసాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సైకిలిస్టులను సూచిస్తుంది. లోగో కింద #June3WorldBicycleDay అనే హ్యాష్‌ట్యాగ్ ఉంటుంది. ఈ సైకిల్ సమస్త మానవాళికి సేవ చేస్తుందని చూపించడం ఈ హ్యాష్‌ట్యాగ్ ముఖ్య ఉద్దేశ్యం.

ప్రాముఖ్యత మార్చు

  1. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడానికి ప్రపంచ సైకిల్ దినోత్సవం కృషిచేస్తోంది.[6]
  2. సైక్లింగ్ కావ‌ల్సిన ఉత్తమ పద్ధతులను, స‌రైన‌ మార్గాలను అవలంబించేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తోంది.
  3. రహదారి భద్రతను మెరుగుపరచడానికి, పాదచారుల భద్రతను కాపాడటానికి సైకిల్ వాడ‌కాన్ని ప్రోత్సహిస్తోంది.[7]

కార్యక్రమాలు మార్చు

  1. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ సైకిల్ వాడకంపై, సైక్లింగ్ చేయడంవల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తాయి.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "World Bicycle Day, 3 June". www.un.org (in ఇంగ్లీష్). Retrieved 3 June 2020.
  2. ఈనాడు, క్రీడలు (25 April 2018). "జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవం (ఈనాడు)". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2020. Retrieved 3 June 2020.
  3. Senarath, Yohan (1 May 2018). "World Bicycle Day: Meet the man who made it happen". Transport for Development (in ఇంగ్లీష్). Retrieved 3 June 2020.
  4. A.Res.72.272 World Bicycle Day, United Nations Resolution
  5. Staff. "MC Professor and Students Win UN Support for World Bicycle Day".
  6. "Mateusz Rudyk".
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (27 May 2020). "జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్స‌వం". www.sakshieducation.com. Archived from the original on 4 జూన్ 2020. Retrieved 4 June 2020.

ఇతర లంకెలు మార్చు