ప్రభాకర్ మోర్
ప్రభాకర్ మోర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రామీణాభివృద్ధి & హోం వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు.
ప్రభాకర్ సుందర్‌రావు మోర్ | |||
పదవీ కాలం 1990 – 2004 | |||
ముందు | శాంతారామ్ ఫిల్సే | ||
---|---|---|---|
తరువాత | మాణిక్ జగ్తాప్ | ||
నియోజకవర్గం | మహద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1944 తమ్హాని గ్రామం, మహద్, మహారాష్ట్ర | ||
మరణం | 2019 సెప్టెంబర్ 14 ముంబై | ||
జాతీయత | భారతీయుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుప్రభాకర్ మోర్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 1995,[2] 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[3] గ్రామీణాభివృద్ధి & హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, రాయిగఢ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పని చేశాడు.
మరణం
మార్చుప్రభాకర్ మోర్ వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2019 సెప్టెంబర్ 14న మరణించాడు. ఆయనకు భార్య, కుమారుడు అమిత్, కుమార్తెలు ఉన్నారు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "माजी गृहराज्यमंत्री प्रभाकर मोरे यांचे वृध्दापकाळाने निधन". ETV Bharat News. 14 September 2019. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ "माजी मंत्री प्रभाकर मोरे यांचे निधन". Lokmat. 15 September 2019. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.