ప్రభుత్వ ఋణం

సార్వజనిక ఆర్థికశాస్త్రంలో ప్రభుత్వ ఋణం అంటే ఒకానొక సమయంలో ప్రభుత్వం ఋణదాతలకు చెల్లించాల్సిన అప్పుల మొత్తం.[1][2] ఈ ఋణం దేశంలో ఉన్న వారి దగ్గర నుంచి కావచ్చు, లేదా విదేశాల దగ్గర నుంచి కావచ్చు. ప్రభుత్వ ఋణం అనేది ప్రభుత్వ బడ్జెట్ లోటుకు భిన్నమైనది. బడ్జెట్ లోటు అంటే సాధారణంగా ఒక సంవత్సరంలో ప్రభుత్వం తాము ఖర్చు చేస్తున్న నిధుల కన్నా, రావల్సిన నిధులు తక్కువైనప్పుడు ఏర్పడేది. ప్రభుత్వ ఋణం అప్పటి దాకా ప్రభుత్వం చెల్లించాల్సిన పేరుకుపోయిన అప్పుల మొత్తం. ప్రభుత్వం ఈ అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఋణాల్ని సాధారణంగా వాటిని చెల్లించవలసిన కాలవ్యవధిని బట్టి విశ్లేషిస్తుంటారు. స్వల్పకాలిక ఋణాలు అంటే ఒక సంవత్సరం లేదా అంతకన్నా లోపు చెల్లించాల్సినవి. దీర్ఘకాలిక ఋణాలు అంటే పది సంవత్సరాలు లేదా అంతకు మించిన కాలవ్యవధిలో చెల్లించవలసిన ఋణాలు. ఈకాలాల మధ్య ఉన్నవి మధ్యస్థ ఋణాలు.

ప్రభుత్వాలు బాండ్లు, బిల్స్ జారీ చేయడం ద్వారా ఋణాలు సేకరిస్తుంటాయి. కొన్ని దేశాలు ప్రపంచ బ్యాంకు, ఇంకా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు తీసుకుంటాయి.

ప్రభుత్వ బాండ్లుసవరించు

 
న్యూయార్కులో 2012 లో ఆదేశపు అప్పును సూచించే బోర్డు

ప్రభుత్వ బాండు అంటే కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లు. ఈ బాండ్లు సాధారణంగా ఆ దేశపు కరెన్సీలోనే ఉంటాయి. కానీ ప్రభుత్వాలు వేరే దేశాల కరెన్సీ ఉపయోగించి కూడా బాండ్లు జారీ చేయవచ్చు. ప్రభుత్వ బాండ్లు తక్కువ రిస్కు కలిగినవాటిగా పరిగణిస్తారు; ఎందుకంటే ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నా కూడా కొత్తగా కరెన్సీని ముద్రించి కూడా చెల్లించే అధికారం కలిగి ఉంటాయి. చాలా దేశాల్లో ఈ విధంగా ధనాన్ని ముద్రించడం చట్టపరంగా ప్రభుత్వాలకు సాధ్యం కాకపోయినా, కేంద్రబ్యాంకులు ఈ బాండ్లను తీసుకుని ధనాన్ని చెల్లిస్తాయి.

మూలాలుసవరించు

  1. "Bureau of the Public Debt Homepage". United States Department of the Treasury. Archived from the original on October 13, 2010. Retrieved October 12, 2010.
  2. "FAQs: National Debt". United States Department of the Treasury. Archived from the original on October 21, 2010. Retrieved October 12, 2010.