ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఖైరతాబాద్

ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1973సంలో స్థాపించబడింది. ఈ కళాశాల 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డులోని ఖైరతాబాద్లో ఈ కళాశాల ఉంది. చింతల్ బస్తీ కాలనీలోకి ఉన్న ఈ భవనం నిజాం కాలంనాటిది. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ పరిపాలనకు ఈ భవనాన్ని ఉపయోగించేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1973 వ సంవత్సరంలో ఈ భవనంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేసింది. 70, 80, 90వ దశకాల్లో ఈ కాలేజీ ప్రభ ఎంతగానో వెలిగిపోయింది. మాజీ మంత్రి దానం నాగేందర్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కళాశాలలో విద్యనభ్యసించినవారే. 2010 నుండి ఈ కాలేజిని కో-ఎడ్యూకేషన్ కాలేజిగా మార్చారు.

ప్రభుత్వ డిగ్రి కళాశాల ఖైరతాబాద్ ప్రాంగణం

ఈ కళాశాలలో 3 భవనాలు ఉన్నాయి. ఈ కళాశాలలో B.A, B.com, B.sc కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సుకు వేరు వేరు శాఖలు ఉన్నాయి. ఈ కళాశాలలో ఎందరో గొప్ప వ్యక్తులు చదువు కున్నారు. ఇక్కడి వాతావరణం చాల ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యలయానికి అనుసంధానమై ఉంది. ఇందులో సుమారుగా 1000 మంది విద్యార్థులు, 50మంది అధ్యాపకులు ఉన్నారు. ఈ కళాశాలలో ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, అందుబాటులో ఉన్నాయి.ఎన్.సి.సి. శిక్షణలో భాగంగా కేడెట్లలో జాతీయ సమైక్యతా భావము పెంపొందించటానికి జాతీయ సమైక్యతా శిబిరాలు నిర్వహిస్తారు.సాధారణంగా ఈ శిబిరాలలో దేశంలోని అన్నీ రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడిన కేడెట్లు ఒకే ప్రాంగణములో కలిసి బస చేయటం వలన వారి మధ్య స్నేహభావము,అవగాహన ఏర్పడుతుంది.

శాఖలుసవరించు

 
వికీపీడియా:శిక్షణ-శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్ 7