ప్రమీల మల్లిక్
ప్రమీల మల్లిక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బింఝార్‌పూర్ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో రెవెన్యూ, విపత్తూ నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[1]
ప్రమీల మల్లిక్ | |||
| |||
రెవెన్యూ & విపత్తూ నిర్వహణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2022 జూన్ 5 నుండి ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1990-1995 | |||
ముందు | నాబాకిషోర్ మల్లిక్ | ||
---|---|---|---|
తరువాత | అర్జున్ దాస్ | ||
నియోజకవర్గం | బింఝార్పూర్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2000 - ప్రస్తుతం | |||
ముందు | అర్జున్ దాస్ | ||
నియోజకవర్గం | బింఝార్పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మార్చి 1963 | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా దళ్ | ||
జీవిత భాగస్వామి | దామోదర్ మల్లిక్ | ||
సంతానం | 1 కుమార్తె |
ప్రమీలా మల్లిక్ 2023 సెప్టెంబరు 22న ఒడిశా శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రతిష్ఠాత్మకమైన పదవిని చేపట్టిన మొదటి మహిళగా అవతరించింది.[2] ఆమె 2023 సెప్టెంబరు 21న రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి పదవికి రాజీనామా చేసి, స్పీకర్ పదవికి బిజూ జనతా దళ్ (BJD) అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేసింది.
రాజకీయ జీవితం
మార్చుప్రమీల మల్లిక్ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1990లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బింఝార్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 1995లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం బిజూ జనతా దళ్ పార్టీలో చేరింది. ప్రమీల మల్లిక్ ఆ తరువాత 2000లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసి గెలిచి ఆ తరువాత వరుసగా 2005, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2004లో మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, ఆ తరువాత 2019లో ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసి 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో రెవెన్యూ & విపత్తూ నిర్వహణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[3][4]
మూలాలు
మార్చు- ↑ "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ "Odisha Assembly gets its first woman Speaker as Pramila Mallik elected unopposed - The Hindu". web.archive.org. 2023-09-22. Archived from the original on 2023-09-22. Retrieved 2023-09-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.