ప్రసాదం (సంస్కృత: प्रसाद), ప్రసాదం, ప్రసాద్, ప్రసాద అని అంటారు. ఇది శాఖాహారం పదార్ధం. ఇది హిందూ మతం, సిక్కు మతం రెండింటిలోనూ మతపరమైన సమర్పణ విధానాలలో ఒకటిగా భావించబడుతుంది. దీనిని సాధారణంగా దేవతారాధకులకు, భక్తులకు పంచిపెట్టబడుతుంది. సిక్కు మతంలోని లాంగరు మాదిరిగానే హిందూ మతంలో మహాప్రసాదం (భండారా అని కూడా పిలుస్తారు). [1] ఆలయంలోని దేవతకు నివేదిన చేసే ఆహారం. దేవతకు నివేదింక ముందు సధారణమైన ఆహారం నివేదించిన తరువాత దేవతయొక్క అనుగ్రహదృష్టి ప్రసారం కారణంగా పవిత్రమైన ఆహారంగా భావించబడుతుంది. తరువాత దీనిని వివక్ష లేకుండా ప్రజలందరికీ పంచిపెడతారు.[2][3][4] కొన్నిసార్లు ఈ శాఖాహార సమర్పణ వెల్లుల్లి, ఉల్లిపాయ, మూలాలు మొదలైన మానసిక ఉద్రేకం కలిగించే నిషేధిత మసాలా వస్తువులతో తయారుచేసిన ఆహారాలను దేవతలకు నివేదిచడంలో మినహాయించబడింది.[2]

పోకచెట్టు లోని వ్యర్ధభాగాలతో పర్యావరణ అనుకూలంగా చేసిన దొన్నేలో వితరణ చేసిన " కిచడి " అనే అహారప్రసాదం; ఇస్కాను ఆలయం బేంగుళూరు

పేరు వెనుక చరిత్రసవరించు

 
గుంటూరులోని ఒక నివాసగృహంలో పూజ చేసిన తరువాత అరటి ఆకులలో వడ్డించబడిన భోజనరూప ప్రసాదమ్

ప్రసాదం అనే మాట ముందే ఉన్న అదే క్రియ కూర్చోవడం, నివసించడం నుండి ఉద్భవించింది. ప్ర ఏకాక్షరం ఒక పదానికి ముందు చేర్చినట్లైతే ఆ పదం పవిత్రమైన నే అదనపు అర్ధం స్పురింపజేస్తూ పరిమిత క్రియగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణగా క్రియ అంటే చర్య అనే ఒక అర్ధం వస్తుంది. క్రియ అనే పదానికి ముందుగా ప్ర అనే ఏకాక్షరం చేర్చినప్పుడు(ప్ర+క్రియ)అది ప్రక్రియ అనే పదంగా పవితరమైన చర్యగా అర్ధం స్పురింపజేస్తుంది. प्रसीदति - నివసిస్తుంది, అధ్యక్షత వహిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది లేదా అనుకూలంగా ఉంటుంది. 'ప్రసాదం' అంటే దయగల బహుమతి. ఇది దేనినైనా సాధారణంగా తినదగిన ఆహారాన్ని సూచిస్తుంది. ఇది మొదట దేవత, సాధువు, పరమ గురువు అవతారానికి అర్పించబడుతుంది. తరువాత ఆయన లేదా ఆమె పేరు మీద వారి అనుచరులకు లేదా ఇతరులకు మంచి సంకేతంగా పంపిణీ చేయబడుతుంది.[5]

వైవిధ్యమైన పేర్లుసవరించు

 
అహ్మదాబాదులో శ్రీ స్వామినారాయణ మందిరంలో థాలు రూపంలో నివేదించబడిన ప్రసాదం

ఆధ్యాత్మిక స్థితిగా ప్రసాదానికి వేద సాహిత్యం నుండి సంస్కృత సంప్రదాయంలో అర్ధాల గొప్ప చరిత్ర ఉంది. ఈ వచన సంప్రదాయంలో ప్రసాదం అనేది దేవతలు, సన్యాసులు, ఇతర శక్తివంతమైన జీవులు అనుభవించిన మానసిక స్థితి, ఇది ఆకస్మిక ఔదార్యం, వరం ఇవ్వడంగా గుర్తించబడుతుంది. తొలి సాహిత్యంలో (ఋగ్వేదం) ప్రసాదం అనే పదం మానసిక స్థితిని సూచించడానికి ఉపయోగించబడింది. అంటేకాని ఆచార సాధనలో ఇది ఒక అంశం కాదు. శివ పురాణం వంటి తరువాతి గ్రంథాలలో ప్రసాదాన్ని ఒక భౌతిక పదార్ధంగా సూచించడం ఈ పాత అర్ధంతో పాటు కనిపించడం ప్రారంభిస్తుంది.[ఆధారం చూపాలి]ప్రసాదం సంవేగాకు తోడుగా ఉన్న ఎమోషన్ (వృద్ధాప్యం, అనారోగ్యం, మరణంతో సిద్దార్థ తాను మొదట అనుభవించిన భావోద్వేగం). అటవీ శ్రమణాన్ని ఎదుర్కోవడంలో సిద్ధార్థ భావించిన భావోద్వేగం ప్రసాదం: "ఒక మార్గం కనుగొన్నట్లు నిర్మలమైన విశ్వాసం స్పష్టమైన భావం" (రాబిన్సను, పేజి 7, 2005). సంవేగా మనస్సును కదిలించి తరువాత అది ప్రసాదం ప్రశాంతంగా ఉంటుంది. రెండు భావోద్వేగాలు ఒకదానికొకటి సరైన సమతుల్యతను అందిస్తాయి: "సమవేగా ప్రసాదాన్ని వాస్తవానికి స్పురింప చేస్తుంది; ప్రసాద సమవేగాను నిస్సహాయ స్థితిగా మార్చకుండా చేస్తుంది" (ఐబిడు.)

ప్రసాదం భౌతిక కోణంలో మానవ భక్తునికి, దైవిక శక్తికి మధ్య ఇవ్వడం, స్వీకరించడం అనే ప్రక్రియ ద్వారా ప్రసాదం అనే పదం సృష్టించబడుతుంది. ఉదాహరణకు ఒక భక్తుడు పువ్వులు, పండ్లు లేదా వండినవి, వండనివి అయిన ఆహారపదార్థాన్ని అర్పిస్తాడు - దీనిని నైవేద్యం అని పిలుస్తారు. అప్పుడు దేవత సమర్పణలో కొంత ఆనందిస్తుంది లేదా రుచి చూస్తుంది. దీనిని తాత్కాలికంగా భోగ్య అని పిలుస్తారు. ఇప్పుడు దైవంగా పెట్టుబడి పెట్టిన ఈ పదార్థాన్ని ప్రసాదం అని పిలుస్తారు. దీనిని భక్తుడు స్వీకరించడం, ధరించడం మొదలైనవి అందుకుంటారు. ఇది మొదట నివేదించిన పదార్థం లేదా ఇతరులు నివేదించే పదార్థం తరువాత ఇతర ఇది ప్రసాదంగా భక్తులకు తిరిగి పంపిణీ చేయబడుతుంది. అనేక దేవాలయాలలో, భక్తులకు అనేక రకాల ప్రసాదాలు (ఉదా., కాయలు, స్వీట్లు) పంపిణీ చేయబడతాయి.

ఆచరణలుసవరించు

కొంతమంది కఠినమైన గౌడియా వైష్ణవులు ప్రారంభించిన ఇస్కాను సంస్థకు చెందిన భక్తులు ప్రసాదం మాత్రమే తింటారు. అనగా వారు తినే ప్రతిదాన్ని మొదట కృష్ణుడికి అర్పిస్తారు. ఇతర హిందువులు కొన్ని మాత్రమే నివేదిస్తారు. అదనంగా ప్రసాదం వంట భగవంతుడికి నివేదించడానికి ముందు రుచి చూడకుండా చేయాలన్న నియమం ఉంటుంది. ఎందుకంటే ఇది విశ్వాసి సొంత వినియోగం కోసం కాదు. కృష్ణుడికి అర్పించడం - వారు కృష్ణుడి ఆహారం అవశేషాలను అందుకుంటారు. వారు కృష్ణుడికి భిన్నంగా భావిస్తారు. ఇస్కాను దేవాలయాలు వచ్చే వారందరికీ ఉచిత ప్రసాద భోజనం అందించడానికి ప్రసిద్ది చెందాయి. ఎందుకంటే ఇది పేదలకు ఆహారం ఇవ్వడమే కాదు, కృష్ణుడి దయను కూడా అందిస్తుందని వారు విశ్వసిస్తారు.[6][7]

ప్రసాదం సాధారణంగా తయారుచేసే ఒక మార్గం, గౌరవించబడే ఆధ్యాత్మిక వ్యక్తి, చిత్రం లేదా దేవత శిలారూపం ముందు ఆహారాన్ని సమర్పించడం. కొన్నిసార్లు ఒక ప్లేటు మీద లేదా ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించిన పాత్ర; కొంత సమయం గడిచిన తరువాత, ఆహారం ప్రసాదంగా మారి పంపిణీగా మారి పవిత్ర ప్రసాదం అవుతుంది.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Pashaura Singh, Louis E. Fenech, 2014, The Oxford Handbook of Sikh Studies
  2. 2.0 2.1 Chitrita Banerji, 2010, Eating India: Exploring the Food and Culture of the Land of Spices.
  3. Subhakanta Behera, 2002, Construction of an identity discourse: Oriya literature and the Jagannath cult (1866-1936), p140-177.
  4. Susan Pattinson, 2011, The Final Journey: Complete Hospice Care for the Departing Vaishnavas, pp.220.
  5. Natu, Bal, Glimpses of the God-Man, Meher Baba, Sheriar Press, 1987
  6. "Bhagavad-Gita 3:13". Archived from the original on 2019-12-06. Retrieved 2019-11-01.
  7. "Bhagavad-Gita 9:27". Archived from the original on 2019-10-18. Retrieved 2019-11-01.

వెలుపలి లింకులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

నైవేద్యం

తిరుమల ప్రసాదం


"https://te.wikipedia.org/w/index.php?title=ప్రసాదం&oldid=3002453" నుండి వెలికితీశారు