ప్రియతమా తమా సంగీతం

ప్రియతమా తమా సంగీతం 1985 లో విడుదలైన తెలుగు సినిమా ఆలాపన లోనిది. ఈ పాటని వేటూరి సుందరరామమూర్తి రచించాడు. ఈ పాటకు ఇళయరాజా సంగీతాన్నందించగా ఇళయరాజా, ఎస్.జానకి గానం చేసారు. సినిమాలో ఈ పాటకు మోహన్, భానుప్రియ నటించారు.

పాట[1] మార్చు

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం ||

రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే
నాలోన లీలగా నాద స్వరాలుగా
పూసింది లాలస పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో
....... వెన్నెల్లలో
ఈ మోహమెందాక పోతున్నదో
ఈ దేహమింకేమి కానున్నదో
వలపులే పిలువగా ||

పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే
నా పాన్పు పంచుకో ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ ఈ రాతిరి
తేనెల్లు పొంగాలి చీకట్లలో
కమ్మన్ని కౌగిళ్ళలో
నీ తోడు కావాలి ఈ జన్మకి
నే నీడనవుతాను నీ దివ్వెకి
పెదవులో మధువులా ||

మూలాలు మార్చు

  1. "Priyatama Tama [HQ] - Aalapana - Lyrics and Music by S Janaki [Track by Prem] arranged by prem_sagar". Smule (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-14.