ప్రియురాలు (2021 సినిమా)

ప్రియురాలు 2021లో విడుదలైన తెలుగు సినిమా. రామరాజు సినిమా బ్యానర్ పై రామరాజు, అజయ్‌ కర్లపూడి నిర్మించిన ఈ సినిమాకు రామరాజు దర్శకత్వం వహించాడు. పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల , శ్రావ్య దువ్వూరి, వర్ష, కృష్ణంరాజు, జోగి నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సోనీ లివ్‌ ఓటీటీలో సెప్టెంబర్ 17న విడుదలైంది.[1]

ప్రియురాలు
Priyuralu.jpg
దర్శకత్వంరామరాజు
రచనశ్రీ సౌమ్య
నిర్మాతరామరాజు, అజయ్‌ కర్లపూడి
తారాగణంపృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక
ఛాయాగ్రహణంమహి పి రెడ్డి
కూర్పుసాయి రేవంత్
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
రామరాజు సినిమా
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 17 (2021-09-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ఒక ఛానల్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న మాధవ్ (పృథ్వీ మేడవరం) కు తన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్‌లో పై ఫ్లాట్‌ ఉంటున్న దివ్య (మౌనిక)తో పరిచయ ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. అయితే మాధవ్ కు పెళ్లి అయ్యిందనే విషయం చెప్పగానే దివ్య అతన్ని దూరం పెట్టకుండా తన లోని హానెస్ట్ నచ్చి శారీరకంగా కలుస్తుంది. అలా వారిద్దరూ ఓ అపార్ట్ మెంట్ లో అద్దె కు ఉంటుండగా ఆ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ సత్యం (కౌశిక్ రెడ్డి) ఓ పనమ్మాయి సరిత (కామాక్షి భాస్కర్ల)తో వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. ఆమె తో శారీరక సంబంధం ఏర్పరుచుకుంటాడు. అతని కూడా పెళ్ళై ఓ పాప ఉంటుంది. అయితే ఈ అక్రమ సంబంధం తన భార్య కు తెలుస్తుంది. ఆ తరువాత ఏమవుతుంది. ఈ కథ కి హీరో కి ఏ సంబంధం ఉంటుందనేదే ఈ సినిమా మిగతా కథ.[2][3]

నటీనటులుసవరించు

  • శ్రావ్య దువ్వూరి
  • వర్ష
  • కృష్ణంరాజు
  • జోగి నాయుడు
  • పృథ్వీ మేడవరం
  • కౌషిక్ రెడ్డి
  • కల్పాల మౌనిక
  • కామాక్షి భాస్కర్ల

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్:రామరాజు సినిమా
  • నిర్మాత: రామరాజు, అజయ్‌ కర్లపూడి
  • స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: రామరాజు
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీవల్లి, పూర్ణాచారి, సిరాశీ
  • సంగీతం: సునీల్ కశ్యప్
  • సినిమాటోగ్రఫీ : మహి పి రెడ్డి
  • ఎడిటర్: సాయి రేవంత్
  • కథ: శ్రీ సౌమ్య
  • సహ నిర్మాతలు: గంగరాజు, కృష్ణ భట్, విశ్వనాథ్ రాజు

మూలాలుసవరించు

  1. TV5 News (12 September 2021). "సెప్టెంబర్ 17న సోని లివ్‌‌లో 'ప్రియురాలు' సినిమా స్ట్రీమింగ్..!" (in ఇంగ్లీష్). Archived from the original on 19 September 2021. Retrieved 19 September 2021.
  2. TV9 Telugu, TV9 Telugu (17 September 2021). "సామాజిక బాధ్యత... మనసులో ఇష్టం... మధ్యలో 'ప్రియురాలు'". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  3. NTV (17 September 2021). "రివ్యూ: ప్రియురాలు మూవీ". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.

బయటి లింకులుసవరించు