ప్రేమించాలి
ప్రేమించాలి 2014లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2013లో ఆదలాల్ కాదల్ సెయ్వీర్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ప్రేమించాలి పేరుతో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మించాడు. సంతోష్, మనీషా యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 27, 2014న విడుదలైంది. [1]
ప్రేమించాలి | |
---|---|
![]() | |
దర్శకత్వం | సుశీంద్రన్ |
నిర్మాత | సురేష్ కొండేటి |
నటవర్గం | సంతోష్, మనీషా యాదవ్ |
ఛాయాగ్రహణం | సూర్య వి.ఆర్ |
కూర్పు | ఆంటోని |
సంగీతం | యువన్‌శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | ఎస్.కె. పిక్చర్స్ |
విడుదల తేదీలు | 2014 ఫిబ్రవరి 27 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథసవరించు
కార్తీక్ ( సంతోష్ రమేష్), శ్వేత(మనీషా యాదవ్) ఒకే కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుకుంటూ ఉంటారు. కార్తీక్ ఫ్రెండ్స్ సహాయంతో శ్వేతతో పరిచయం పెంచుకుంటాడు. కార్తీక్ ను స్నేహితుడిగానే చూసిన శ్వేత మెల్లగా వారి మధ్యన ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. అలా ఒకరోజు శ్వేతా మరియు కార్తీక్ విహారానికి అని వేరే ఊరుకు వెళ్లిన వాళ్లిదరు అక్కడ శారీరకంగా దగ్గరవుతారు దీని మూలాన శ్వేత గర్భవతి అవుతుంది. ఈ విషయం ఇంట్లో తెలియకుండా దాచిపెట్టాలని ఎంత ప్రయత్నించినా ఇంట్లో పెద్దలకు తెలియడంతో కార్తీక్ మరియు శ్వేత ఎదుర్కున్న పరిణామాలు ఏంటి ? ఇంట్లో పెద్దలు వారి ప్రేమను అంగీకరించారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులుసవరించు
- సంతోష్ - కార్తీక్
- మనీషా యాదవ్ - శ్వేత
- పూర్ణిమ జయరామ్ - కార్తీక్ తల్లి
- రామనాథ్ షెట్టీ - కార్తీక్ తండ్రి
- జయప్రకాశ్ -శ్వేత తండ్రి
- తులసి - శ్వేత తల్లి
- జై - కార్తీక్ జై
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: ఎస్.కె. పిక్చర్స్
- నిర్మాత: సురేష్ కొండేటి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: సుశీంద్రన్
- సంగీతం: యువన్‌శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: సూర్య వి.ఆర్
- ఎడిటర్: ఆంటోని
- సహనిర్మాత: సమన్యరెడ్డి
- పాటలు: పులగం చిన్నారాయణ, భాస్కరభట్ల
మూలాలుసవరించు
- ↑ Sakshi (16 February 2014). "యువతకు సందేశం". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.
- ↑ Sakshi (7 February 2014). "సినిమా రివ్యూ: ప్రేమించాలి". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.