ప్లాటీహెల్మింథిస్

ప్లాటిహెల్మింథిస్ (ఆంగ్లం Platyhelminthes) వర్గాన్ని గెగెన్ బార్ ఏర్పరిచారు. సాధారణంగా బల్లపరుపు పురుగులు (ప్లాటి:బల్లపరుపు) అని పిలిచే ఈ జీవులు త్రిస్తరిత జీవులు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవంతో, శరీర కుహరరహితంగా ఉంటాయి. ఎక్కువగా పరాన్నజీవులు, కొన్ని స్వేచ్ఛాజీవులు. ఇవి సాగర, మంచినీటి, భూచర పరిసరాలలో నివసిస్తాయి.

ప్లాటిహెల్మింథిస్
Haeckel Platodes.jpg
"Platodes" from Ernst Haeckel's Kunstformen der Natur, 1909
Scientific classification
Kingdom:
Subkingdom:
Superphylum:
(unranked):
Phylum:
ప్లాటిహెల్మింథిస్

Gegenbaur, 1859
Classes

Monogenea
Trematoda
Cestoda
Turbellaria

సాధారణ లక్షణాలుసవరించు

 • శరీరం పృష్టోదరంగా అణిగి ఉంటుంది. కాబట్టి వీటిని సాధారణంగా 'బల్లపరుపు పురుగులు' అంటారు.
 • ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం కనబరుస్తాయి. మధ్య అక్షానికి ఇరువైపులా శరీర అవయవాలు ఉంటాయి. జీవిని సమాయత అక్షంలో ఖండించినప్పుడు దర్పణ ప్రతిబింబ అర్ధబాగాలు ఏర్పడతాయి.
 • మితమైన శిరఃప్రాధాన్యం, ఏకదిశా చలనం కలిగి ఉంటాయి.
 • ఇవి మొట్టమొదటి త్రిస్తరిత జీవులు. ఇవి పిండదశలో మధ్యత్వచాన్ని ఏర్పరుచుకొంటాయి. ఇది మూడో జననస్తరం, నిజ కండర కణజాలం అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
 • జీర్ణనాళానికి, శరీర కుడ్యానికి మధ్య శరీర కుహరం లేదు. కాబట్టి వీటిని కుహరరహిత జీవులు అంటారు. మధ్యత్వచం నుంచి ఏర్పడిన మృదుకణజాలం దీని స్థలంలో నిండి ఉంటుంది.
 • బల్లపరుపు పురుగు శరీర నిర్మాణం, అవయవ, వ్యవస్థల స్థాయిని ప్రదర్శిస్తుంది.
 • జీర్ణనాళానికి ఒకే ఒక్క రంధ్రం ఉంటుంది. అదే నోరు. నిడేరియాలలోలాగ పాయువు లేదు. నోటిద్వారానే ఆహార అంతర్గ్రహణం, మలవిసర్జనం జరుగుతుంది. నిడేరియా జీవులలో లాగా జఠరప్రసరణ కుహరకుడ్యపు కణాలు, ఆహారపదార్ధాలను భక్షించి, కణాంతస్థ జీర్ణక్రియ జరుపుకొంటాయి.
 • మిధ్యాఖండీభవనం గల సెస్టోడా (బద్దెపురుగులు) మినహాయించి ఏ జీవులలోనూ ఖండీభవనం లేదు.
 • జ్వాలా కణాలు అనే ప్రత్యేకమైన ప్రాథమిక వృక్కాలతో విసర్జన జరుగుతుంది. జ్వాలా కణాలు జంతువుకూ పరిసరాలకూ మధ్య ద్రవాభిసరణక్రమతను నియంత్రిస్తాయి.
 • శ్వాస, రక్తప్రసరణ వయవస్థలు లేవు.
 • నాడీవ్యవస్థలో మితంగా అభివృద్ధిచెందిన మెదడు, నాడీదండాలు ఉంటాయి. స్వేచ్ఛగా నివసించే జీవులలో జ్ఞానాంగాలు ఉంటాయి.
 • ఎక్కువగా ఉభయలింగ జీవులలో అంతఃఫలదీకరణ జరుగుతుంది.
 • జీవితచరిత్ర సరళంగా లేదా క్లిష్టంగా ఉంటుంది. ఒకటి లేదా ఎక్కువ మాధ్యమిక అతిధేయులు కలిగి, వివిధ రకాలైన పిండాభివృద్ధి దశలైన మిరాసీడియమ్, స్పోరోసిస్టు, రీడియా, సర్కేరియా మొదలయినవి ఉంటాయి. కొన్నిటిలో బహుపిండత్వం సర్వసాధారణం.

వర్గీకరణసవరించు

ప్లాటిహెల్మింథిస్ వర్గాన్ని మూడు విభాగాలుగా వర్గీకరించారు.

 1. విభాగం 1: టర్బెల్లేరియా:
 • ఇవి చాలా వరుకు స్వేచగా జీఏంచినా అరుదుగా సహజీవనం లేదా పరాన్న జీవనం సాగిస్తాయి.
 • తల భాగంలో కళ్లు గుంతలు స్పర్శకాలు జ్ఞన కంటక రోమాలు వంటివి ఉంటాయి.
 • శరీరం కుడ్యం బయటి భాగంలో శైలికామయ బాహ్య చర్మం ఉంటుంది.బాహ్య చర్మంలో రాబ్డయిట్లు అనే నిర్మాణాలు ఉంటాయి.
 • కొన్నింటిలో నోరు ఉండదు.ఉదా: ఫెకాంఫియా,ఫేగోకాటాలో ఎన్నో గ్రసనులు,తత్ఫలితంగా ఎన్నో ఆస్య రంధ్రాలు ఏర్పడ్డాయి.నోరు ఉంటే ఉదర తలంలో ఉంటుంది.
 • పునరుత్పత్తి అధికంగా ఉంటుంది.
 • ఈ విభాగంలో ఇంత వరకు 3000 ప్రజాతులున్నాయి.
 • ఇందులో ఎసీలా,పాలిక్లాడిడా,రాబ్డోసీలా,టెమ్నోసెపాల,ట్రైక్లాడిడా క్రమాలున్నాయి.
 • ఉదా:ప్లానోసిరా,నోటోప్లాన,దయిసనోజూన్.

2. విభాగం 2:ట్రెమటోడా:

 • ఇవి ఆకు లాగా పల్చగా,బల్ల పరుపుగా ఉండే జీవులు.
 • ఇవి బాహ్య,అంతర పరాన్న జీవనం సాగిస్తాయి.
 • అభివృద్ధిలో బాహ్య చర్మాన్ని కోల్పోయి అవభాసిని "టెగ్యుమెంట్" ఏర్పడుతుంది.
 • రాబ్డయిట్లు లేవు.పూర్వాంతంలో నోరుంటుంది.
 • విసర్జక వ్యవస్థలో శాఖాయుతమైన నాళాలు అమరి ఉంటాయి.
 • ఒకే ఒక స్త్రీ బీజకోశం ఉంటుంది.
 • అభివృద్ధి పరోక్షంగా డింభకాలతో జరుగుతుంది.
 • ఉప విభాగం1:మోనోజెనియా:
 • ఇవి చేపలు,ఉభయ చరాలపై బాహ్య పరాన్న జీవులు.
 • నోటిని ఆవరించి చూషకం ఉండదు.
 • పూర్వాంతంలో రెండు విసర్జక రంధ్రాలుంటాయి.
 • గర్భాశయం పొట్టిగా ఉంటుంది.డింభకం శైలికాసహితం.
 • జీవిత చరిత్ర నేరుగా ఆతిధేయిలను మార్చకుండా జరుగుతుంది.
 1. విభాగం 3: సెస్టోడా: ఉ. టీనియా, ఎకైనోకోకస్