ప్లాస్టిక్ కాలుష్యం

ప్లాస్టిక్ కాలుష్యం అంటే ప్లాస్టిక్ వస్తువులు (ఉదాహరణకు ప్లాస్టిక్ సంచులు, బాటిళ్ళు), వాటి కణాలు భూవాతావరణంలో చేరి మానవులకు, ఇంకా ఇతర జీవరాశులకు, వాటి ఆవాసాలకు తీవ్రమైన హాని కలిగించే పరిస్థితి.[1][2] ప్లాస్టిక్ తక్కువ ధరలో లభ్యమవడం, కాస్తంత మన్నికైంది కావడం వల్ల, ఇతర పదార్థాలకు బదులు వేర్వేరు అవసరాలకు విరివిగా వాడుతున్నారు.[3] కానీ వాటి ప్రత్యేకమైన రసాయన నిర్మాణాల కారణంగా ప్రకృతి సహజంగా శిధిలమవడం చాలా నెమ్మదిగా జరుగుతుంది.[4] పైన పేర్కొన్న రెండు కారణాల వలన సరైన నిర్వహణ లేని ప్లాస్టిక్ వ్యర్థాలు హెచ్చు స్థాయిలో వాతావరణంలో చేరి ఆహారంలోకి కూడా వచ్చి చేరుతున్నాయి.

ప్లాస్టిక్ కాలుష్యం భూమి, నీటి ప్రవాహాలు, సముద్రాలను కూడా ప్రభావితం చేస్తున్నది. 2015 లో చేసిన ఒక పరిశోధన ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 11 నుంచి 88 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తీరప్రాంత సమాజాల ద్వారా సముద్రంలోకి చేరుతోంది.[5] 2013 నాటికి సుమారు 8.6 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల అడుగున పేరుకుపోయి ఉంది. ఇది 1950 నుంచి 2013 దాకా ఉత్పత్తి అయిన మొత్తం ప్లాస్టిక్ లో సుమారు 1.4 శాతం.[6]

మూలాలు

మార్చు
  1. "Plastic pollution". Encyclopædia Britannica. Retrieved 1 August 2013.
  2. Laura Parker (June 2018). "We Depend on Plastic. Now We're Drowning in It". NationalGeographic.com. Archived from the original on 16 May 2018. Retrieved 25 June 2018.
  3. Hester, Ronald E.; Harrison, R. M. (editors) (2011). Marine Pollution and Human Health. Royal Society of Chemistry. pp. 84–85. ISBN 184973240X
  4. Le Guern, Claire (March 2018). "When The Mermaids Cry: The Great Plastic Tide". Coastal Care.
  5. Jambeck, Jenna R.; Geyer, Roland; Wilcox, Chris; Siegler, Theodore R.; Perryman, Miriam; Andrady, Anthony; Narayan, Ramani; Law, Kara Lavender (2015-02-13). "Plastic waste inputs from land into the ocean". Science (in ఇంగ్లీష్). 347 (6223): 768–771. Bibcode:2015Sci...347..768J. doi:10.1126/science.1260352. PMID 25678662. S2CID 206562155.
  6. Jang, Y. C., Lee, J., Hong, S., Choi, H. W., Shim, W. J., & Hong, S. Y. 2015. "Estimating the global inflow and stock of plastic marine debris using material flow analysis: a preliminary approach". Journal of the Korean Society for Marine Environment and Energy, 18(4), 263–273.[1]