ప్లూరసి
ప్లూరిసి ని, ప్లూరిటిస్ అని కూడా పిలుస్తారు, ఇది ఊపిరితిత్తులను చుట్టుముట్టే పొరల, ఛాతీ కుహరం (ప్లురే) వాపు. ఇది శ్వాస సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పికి కారణమవుతుంది.[1] అప్పుడప్పుడు నొప్పి స్థిరంగా నిస్తేజంగా ఉంటుంది. ఇతర లక్షణాలలో అంతర్లీన కారణాన్ని బట్టి శ్వాస ఆడకపోవడం, దగ్గు, జ్వరం లేదా బరువు తగ్గడం వంటివి ఉండవచ్చు[2]. వైరల్ లేదా బాక్టీరియల్ సంక్రమణాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పల్మోనరీ ఎంబోలిజంతో సహా అనేక రకాల పరిస్థితుల వల్ల ప్లూరిసి సంభవించవచ్చు.
ప్లూరిసి | |
---|---|
ఇతర పేర్లు | ప్లూరిటిస్ |
చిత్రం A సాధారణ శరీర నిర్మాణ శాస్త్రాన్ని చూపుతుంది. చిత్రం B, కుడివైపు ఊపిరితిత్తులు ప్లూరిసీతో ను, ఎడమ వైపు ఊపిరితిత్తులు న్యూమోథొరాక్స్‌ను చూపుతుంది. | |
ప్రత్యేకత | పల్మోనాలజీ |
లక్షణాలు | పదునైన ఛాతీ నొప్పి |
కారణాలు | వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, న్యుమోనియా, పల్మనరీ ఎంబోలిజం |
రోగనిర్ధారణ పద్ధతి | ఛాతీ ఎక్స్-రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG), రక్త పరీక్షలు |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | పెరికార్డియాటిస్, మయోకార్డియా, కొలిసిస్టిస్ |
చికిత్స | అంతర్గత కారణాలననుసరించి |
ఔషధం | పారాసెటమాల్, ఎసిటమినోఫెన్, ఇబుప్రోఫెన్ |
తరుచుదనము | సంవత్సరానికి 1 మిలియన్ కేసులు |
అత్యంత సాధారణ కారణం వైరల్ సంక్రమణాలు. ఇతర కారణాలలో బాక్టీరియల్ సంక్రమణాలు, న్యుమోనియా, పల్మనరీ ఎంబోలిజం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స తర్వాత, ప్యాంక్రియాటైటిస్, ఆస్బెస్టాసిస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కారణం తెలియదు.[3] అంతర్లీన మెకానిజం మృదువైన కదలికల బదులుగా ప్లూరే బలమైన కదలికలు కావచ్చు. [1] పెర్కిర్డిటిస్, గుండెపోటు, కోలిసైస్టిటిస్, పల్మనరీ ఎంబోలిజం, న్యూమోథొరాక్స్ వంటి లక్షణాలను కనపరచుతాయి. [4] రోగనిర్ధారణ పరీక్షలో ఛాతీ ఎక్స్-రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG), రక్త పరీక్షలు ఉండవచ్చు. [4] [5]
చికిత్స అంతర్గత కారణంపై ఆధారపడి ఉంటుంది.[4] నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్), ఇబుప్రోఫెన్ ఉపయోగీస్తారు. [6] శ్వాసను పెంచడానికి ప్రోత్సహించడానికి స్పిరోమెట్రీని సిఫార్సు చేస్తారు. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు ఒక మిలియన్ మంది ప్రజలు ఈ వ్యాధికి గురి ఆవుతున్నా రు.[7] హిప్పోక్రేట్స్ క్రీస్తు పూర్వం 400 నాడు ఈ వ్యాధి పరిస్థితి గుర్తించారు [8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "What Are Pleurisy and Other Pleural Disorders?". NHLBI. 21 September 2011. Archived from the original on 8 November 2016. Retrieved 1 November 2016.
- ↑ "What Are the Signs and Symptoms of Pleurisy and Other Pleural Disorders". NHLBI. 21 September 2011. Archived from the original on 8 October 2016. Retrieved 1 November 2016.
- ↑ "What Causes Pleurisy and Other Pleural Disorders?". NHLBI. 21 September 2011. Archived from the original on 8 October 2016. Retrieved 1 November 2016.
- ↑ 4.0 4.1 4.2 Ferri, Fred F. (2016). Ferri's Clinical Advisor 2017: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 981. ISBN 9780323448383. Archived from the original on 3 November 2016.
- ↑ Kass, SM; Williams, PM; Reamy, BV (1 May 2007). "Pleurisy". American Family Physician. 75 (9): 1357–64. PMID 17508531.
- ↑ "How Are Pleurisy and Other Pleural Disorders Treated?". NHLBI. 21 September 2011. Archived from the original on 3 November 2016. Retrieved 1 November 2016.
- ↑ Disease & Drug Consult: Respiratory Disorders (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. 2012. p. Pleurisy. ISBN 9781451151947. Archived from the original on 3 November 2016.
- ↑ Light, Richard W.; Lee, Y. C. Gary (2008). Textbook of Pleural Diseases (in ఇంగ్లీష్) (2nd ed.). CRC Press. p. 2. ISBN 9780340940174. Archived from the original on 3 November 2016.