ఫిడేలు రాగాల డజన్

ఫిడేలు రాగాల డజన్ పఠాభి రాసిన పన్నెండు వచన కవితల సంపుటం. 1939 లో మొదటిసారి వెలువడింది.[1] [2]

పుస్తక విశేషాలు

మార్చు

భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది.[3]

పుస్తక స్వరూపం

మార్చు

కవి ఈ పుస్తకాన్ని వచన పద్యములు అని పేర్కొన్నాడు. పుస్తకం అట్ట మీద - ‘‘చదవండి ఫిడేలు రాగాల డజన్ ’’ అని ఉంటుంది. కింద చిన్న ఫిడేలు బొమ్మ ఉంటుంది. ఇక్కడ కొంత కొంటె దనం. అప్పట్లో కొత్త దనం- కన బరిచారు. ఫిడేలు బొమ్మ కింద రాగాల డజన్ అని ముద్రించారు. కింద చలం గారి మాటలు ... వెనుక అట్ట మీద విద్వాన్ విశ్వం గారివీ, వేదుల (సత్య నారాయణ శర్మ) వారివీ , మాటలు ఉన్నాయి. ఆంధ్ర పత్రిక వారివీ, కథాంజలి వారివీ అభిప్రాయాలు కూడా వేశారు. పుస్తకములు దొరుకు స్థలము : నమ్మాళ్వారు, పోస్టు బాక్సు 251, మద్రాసు అని ఉంటుంది[4] ఇక, ఇంట్రో శ్రీ.శ్రీ రాసేరు. శ్రీ.శ్రీ నవ కవుల తిరుగు బాటుని గురించి రాస్తూ ఫిడేలు రాగాల డజన్ చదవమని సలహా ఇచ్చాడు. 38 పేజీలున్న ఈ చిన్ని పుస్తకంలో పుటల సంఖ్య లన్నీ తెలుగు అంకెలే వేసారు.

మూలాలు

మార్చు
  1. ఫిడేలు రాగాల డజను
  2. "Tikkavarapu Pattabhirama Reddy – Poet, Film maker of international fame from Nellore". Archived from the original on 2016-03-22. Retrieved 2015-10-27.
  3. "భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్". Archived from the original on 2015-07-07. Retrieved 2015-10-27.
  4. "కథా మంజరి". Archived from the original on 2016-03-07. Retrieved 2015-10-27.

ఇతర లింకులు

మార్చు