ఫిలాటెలీ ఉపకారవేతనం
భారత తపాలా శాఖ ఫిలాటెలీ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తులు ప్రతి సంవత్సరం ఆహ్వానిస్తుంది.దీన్ దయాళ్ స్పర్శ్ యోజన లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు[1]. గుర్తింపు పొందిన పాఠశాలలో ఆరు ,ఏడు, ఎనిమిది ,తొమ్మిది వ తరగతి చదువుతూ ఉండాలని విద్యార్థికి తపాలా శాఖలో ఒక ఫిలా టెలీ అనగా (స్టాంపుల సేకరణ) డిపాజిట్ ఖాతా కలిగి ఉండాలని పోస్టల్ అధికారులు వెల్లడించారు. ఇటీవల రాసిన ఫైనల్ పరీక్షల్లో 60 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ వచ్చి ఉండాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కుల లో ఐదు శాతం రాయితీ ఉందన్నారు. ఈ పోటీ రెండు స్థాయిల్లో జరుగుతుందన్నారు. మొదటి దశ రీజనల్ స్థాయిలో రాత పరీక్ష (క్విజ్) ఉంటుందన్నారు. అందులో ఉత్తీర్ణులై ,రెండో దశకు చేరుకున్న వారు ఒక ఫిలాటెలీ ప్రాజెక్టును సమర్పించాల్సి ఉంటుందన్నారు[2]. మొదటి దశ పరీక్షకు ప్రతి సంవత్సరం అక్టోబర్ లోపు దరఖాస్తులు అందజేయడం జరుగుతుంది. ముఖ్యమైన ఈ ఉపకార వేతనం యొక్క వివరాలను తెలుసుకునేందుకు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ కార్యాలయాల్లో సంప్రదించాలని పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ స్కాలర్షిప్ కు అర్హత పొందిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలను అందజేయడం జరుగుతుంది. ఈ ఉపకార వేతనం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల యొక్క విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసి వారి యొక్క ఉన్నత విద్యకు దోహదం చేసేందుకు ఉద్దేశించిన పథకం[3].
మూలాలు
మార్చు- ↑ "Deen Dayal SPARSH Yojana". www.indiapost.gov.in. Retrieved 2023-09-07.
- ↑ "Philately scholarship scheme by postal department". The Times of India. 2022-07-21. ISSN 0971-8257. Retrieved 2023-09-07.
- ↑ "Postal Scholarships: పోస్టల్ శాఖ బంపర్ ఆఫర్.. విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేత." News18 Telugu. 2023-08-19. Retrieved 2023-09-07.