ఫిలిం గ్రెయిన్ (ఆంగ్లం: Film Grain) ఫిలిం ఫోటోగ్రఫీ లో కనబడే అవాంఛిత లక్షణం. ఫిలిం లో ఉండే సిల్వర్ కాంపొనెంట్ ల వలన ఇది ఏర్పడుతుంది. ఫిలిం గ్రెయిన ఏర్పడితే ఫోటోపై సన్నని నూక పోసినట్లు మసకగా కనబడుతుంది. పాత తరం ఫోటోగ్రఫీ లో దీనిని ఫిలిం యొక్క అవలక్షణం గా పరిగణించి, ఫోటోలలో ఇది రాకుండా ఉండటానికి పలు ప్రయత్నాలు చేసేవారు. కానీ ఫిలిం విప్లవం వచ్చిన తర్వాత ఇది ఎలా వస్తుందో తెలుసుకొని ఫిలిం ప్రేమికులు దీనిని అదే పనిగా తమ ఫిలిం ఫోటోలపై రప్పించటం మొదలు పెట్టారు. దీనిని ఫిలిం యొక్క కళాత్మక లక్షణంగా పరిగణించటం మొదలు పెట్టారు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటో పై కనబడే ఫిలిం గ్రెయిన్

కారణాలు

మార్చు
 
వివిధ ఫోటోగ్రఫిక్ ప్లేట్ల పై ఫిలిం గ్రెయిన్ ఏర్పడే తీరు
  • కాంతిని తగ్గించకుండా కావలసిన సమయం కంటే షట్టరును ఎక్కువ సమయం తెరచి ఉండటం
  • కాంతిని తగ్గించకుండా కావలసిన సూక్ష్మరంధ్రం కంటే పెద్ద సూక్ష్మ రంధ్రాన్ని ఎంచుకోవటం
  • ఎక్కువ వేగం గల ఫిలిం పై ఎక్కువ కాంతి ఉన్న సబ్జెక్టును చిత్రీకరించటం

పై కారణాల వలన సిల్వర్ కాంపొనెంట్ లు అతిగా రసాయనిక చర్యకు గురి అయ్యి ఫోటోల పై గ్రెయిన్ కనబడుతుంది.

నియంత్రణ

మార్చు
  • 135 ఫిల్మ్, మీడియం ఫార్మాట్ ఫిల్మ్ లతో పోలిస్తే లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్ పై గ్రెయిన్ ఏర్పడే అవకాశం తక్కువ. (సూక్ష్మరంధ్రం యొక్క వైశాల్యం పెరిగిననూ లార్జ్ ఫార్మాట్ పై దాని ప్రభావం పరిమితంగానే ఉండటం మూలాన).
  • ఫిలిం వేగం పెరిగే కొద్దీ ఫిలిం గ్రెయిన్ ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి తక్కువ ఫిలిం వేగం ఉన్న ఫిలిం ను ఎంచుకోవాలి. (ఐ ఎస్ ఓ 3200 వేగం గల ఫిలిం తో పోలిస్తే ఐ ఎస్ ఓ 200 వేగం గల ఫిలిం పై గ్రెయిన్ ఏర్పడే అవకాశం ఎక్కువ.)
  • దీర్ఘ బహిర్గతాలను, పెద్ద సూక్ష్మ రంధ్రాలను ఎంచుకొన్నప్పుడు కాంతిని తగినంత తగ్గించుకోవటం.

ఇవి కూడా చూడండి

మార్చు