ఫూల్స్ డై (నవల)

(ఫూల్స్ ఓన్లీ డై నవల నుండి దారిమార్పు చెందింది)

ఇటాలియన్ మూలాలున్న సుప్రసిద్ధ అమెకన్ మాఫియా కథల నవలా రచయిత మారియో పూజొ ట్రయాలజిలో ఫూల్స్ డై (Fools Die) రెండోది. తొలిముద్రణ(1978) ఒకేసారి కోటికాపీలకు మించి అమ్ముడయ్యాయి.

Fools Die
దస్త్రం:Fools Die.jpg
First edition
రచయిత(లు)Mario Puzo
దేశంUnited States
భాషEnglish
శైలిCrime novel
ప్రచురణ కర్తG. P. Putnam's Sons
ప్రచురించిన తేది
9 October 1978
మీడియా రకంPrint (hardback & paperback) & Audiobook
పుటలు544 pp (Paperback edition)
ISBN0-399-12244-3 (Hardcover edition) & ISBN 0-451-16019-3 (Paperback editions)
OCLC3912796
813/.5/4
LC ClassPZ4.P994 Fn 1978 PS3566.U9
Preceded byThe Godfather 
Followed byThe Sicilian 

బహుశా స్వేచ్ఛాప్రణయ ఉద్యమం, హిప్పిఉద్యమం కొనసాగుతున్న 1960 మధ్య భాగంనుంచి, 1970 దశాబ్దాలమధ్య కథ కావచ్చు. ఆనాటి అమెరికా నేరమయ జీవితం, కెసినొ జూదగృహాలు, వృత్తి జూదగాళ్ళు, హోటల్ Xandu వంటి విలాసవంతమైన హోటళ్లు, మద్యశాలలు, , కెసినొ నిర్వాహకుల మోసాలు, నేరాలు, హత్యలు, శరీరసౌందర్యమే పెట్టుబడిగా సినిమాలలోనో, ఏ కోటీశ్వరుడో ప్రేమిస్తే అతని భార్యగానో, మరోరకంగానో పైకి రావాలని ప్రయత్నించే అందగత్తెలు, పారిశ్రామిక వేత్తలు, మహా సంపన్నులను ఆకర్షించేందుకు సకల సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన హోటళ్లున్న లాస్ వెగాస్ నగరంలో కథలో చాలా భాగం సాగుతుంది.

హాలీవుడ్ లో సినిమాల నిర్మాణానికి, కథను సమకూర్చిన రచయిత మెరిలిన్ పాట్లు, అవమానాలు నవలలో మరొక భాగం. ఇంకో భాగం న్యూయార్క్ పుస్తక ప్రచురణ, రచయితలు, వారి ఆటుపోట్లు, నిలద్రొక్కుకోవడానికి పడే పాట్లు నేపథ్యంగా చిత్రించబడింది.

కథాసంగ్రహం

మార్చు

క్లబ్ లోనే మకాంపెట్టి రాత్రీపగలు జూదమాడే ముగ్గురు మిత్రులు కెల్లీ, మెరిలిన్, జోర్డాన్, ఎంతకాలం నుంచి మిత్రులో కూడా పాఠకులకు తెలియదు. జోర్డాన్ అదృష్టదేవత తలుపు తట్టి ఆటలో ఒకే సారి అర్ధమిలియన్ డాలర్లు గెలుచుకొంటాడు. అతను సుఖపడిపోగలడని, అతని దరిద్రం వదిలిందని ఇద్దరు మిత్రులూ భావిస్తారుగానీ, ఆరాత్రి మద్యంసేవించి హోటల్ సూట్లో పడుకొని జోర్డాన్ రివాల్వర్ తో కాల్చుకొని చచ్చిపోతాడు. ఆత్మహత్యకు కారణం రచయిత మన ఊహకు విడిచిపెడతాడు. చట్టం ప్రకారం అతను జూదంలో గెలిచిన డబ్బులు అతని భార్యకు పోలీసులు అప్పగిస్తారు. ఆ మిత్రుల్లో మిగిలిన కెల్లి, మెరిలిన్ లలో మెరిలిన్ ఈ నవలో కథానాయకుడు.

సమస్యా చిత్రణం

మార్చు

రచయిత కొంతభాగం కధను సర్వసాక్షి దృష్టికోణం నుంచి, కొన్ని భాగాలు ఆయా పాత్రల దృష్టి కోణంనుంచి వివరిస్తాడు.

మెరిలిన్ తొలి నవల ప్రచురణ అయింది కాని పాఠకుల ఆదరాన్ని అంతగా చూరగొనలేదు. అతని భార్య, పిల్లలు న్యూయార్కులో ఉన్నా తను లాస్ వెగాస్.కు వచ్చి జూదమాడి వెళుతూంటాడు. కెల్లి, మెరిలిన్ ఇద్దరు కెసినొ యజమాని గ్రోన్.వెల్టు ఏజంట్లుగా వ్యవహరిస్తూ, జూదమాడుతూ జీవనం కొనసాగిస్తారు.

ఆ కెసినొలో జేన్లీ, ఛార్లిబ్రౌన్ వంటి అందమైన యువతులు జూదమాడుతూ, పోషకులకోసం వలపన్నుతూంటారు. ఈ నవలలో అతిముఖ్యమైన స్త్రీ పాత్రలు జేన్.లీ, ఛార్లిబ్రౌన్ అక్కడే మనకు పరిచయమవుతారు. జేన్.లీ చాలాఅందమైన యువతి. ఆమె సినిమాఛాన్స్.లకోసం ప్రయత్నిస్తూ, జూదమాడుతూ క్లబ్ యజమాని గ్రోన్.వెల్టు చెప్పినట్లు నడచుకొంటూ ఐశ్వర్య వంతులను తృప్తి పరుస్తూన్న సమయంలో మెరిలిన్ పట్ల ఆకర్షితురాలవుతుంది. మెరిలిన్ అప్పటికి భార్య, పిల్లలతో సంప్రదాయ పద్ధతిలో గృహస్థుగా ఉంటాడు. అతని భార్యకు తన భర్త రచయిత అని తప్ప అతని రహస్య జీవితం గురించి ఏమాత్రం తెలియదు.

రచయిత మేరియో పూజో జీవిత సంఘటనలు నవలలో కనిపిస్తాయి. నవలలో మెరిలిన్, అతని అన్న కల్లి అనాథాశ్రమంలో పెరిగారు రచయిత మాదిరిగానే. మెరిలిన్ జీవితాశయం రచయితగా స్థిరపడడం. అతని భార్య వెలరి పిల్లలను చదివించుకొంటూ భర్తను విపరీతంగాఅభిమానిస్తూ కేథలిక్ విలువలతో న్యూయార్క్ లో జీవిస్తుంటుంది. సినిమా ఛాన్సులకోసం లాస్ వేగాస్ వచ్చిన జేన్లీ మెరిలిన్ కు జూదశాలలో పరిచయమవుతుంది, ఆమె స్వచ్ఛమైన ప్రేమకు లొంగి మెరిలిన్ తన ఏకపత్నీవ్రతాన్ని వదులుకుంటాడు. నైతికనిష్ట కలిగిన మెరిలిన్ క్రమంగా దిగజారుతాడు. మెరిలిన్ సైన్యం రిజర్వు దళాల రెకౄట్.మెంటుశాఖలో చిన్న ఉద్యోగి. కొరియా యుద్ధం సాగుతున్న సమయం. యువజనాన్ని సైన్యం లోకి తీసుకొని యుద్ధరంగానికి పంపుతోంది ప్రభుత్వం. రిజర్వు ఫోర్సులో చేరినవారు అత్యవసర సమయంలో మాత్రమే యుద్ధరంగానికి వెళ్ళవలసి ఉంటుంది. మెరిలిన్, మరొక ఉద్యోగితో షరీకై లంచాలు తీసుకొని ధనవంతుల, రాజకీయ నాయకుల బిడ్డలను ప్రత్యేకంగా రిజర్వు దళంలోకి తీసుకొంటారు. అక్రమసంపాదన ఇంట్లో దాచుకోకుండా, లాస్ వెగాస్ తీసుకుని వెళ్ళి, మిత్రుడు కెల్లి సహాయంతో జూదంలో గెలిచినట్లు చూపి, కెసినొలో తన అకౌట్లో వేయించి, ఆవిషయం వీలునామా రాసి లాస్.వెగాస్.లో న్యాయవాది వద్ద ఉంచుతాడు- తనకేమైనా అయితే కుటుంబానికి చెందేట్లు. వెగాస్.లో జేన్లీ ప్రేమలో పడి తన నైతిక నియమాన్ని కూడా వదులుకొంటాడు. మెరిలిన్ అన్నది అకల్మషమైన జీవితం. అతని భార్య పిల్లలు అతని ఆదర్శ కుటుంబం. తమ్ముడు మెరిలిన్ చిక్కుల్లో పడినప్పుడు సహాయం చేస్తాడు. నడి వయసులో కేన్సర్ తో పోతాడు.

ఈ నవలలో మరొక ప్రధాన పాత్ర ఒసానొ. అతని నవలను సినిమా గా చిత్రీకరిస్తుంటే హాలీవుడ్ వచ్చి వెగాస్. లో Hotel Xanduలో ఉంటాడు.తన రచన నోబుల్ పురస్కారం పొందదగినదని అతని అభిప్రాయం. ఒసానొ ఛార్లిబ్రౌన్ ను తనవెంట న్యూయార్క్ తీసుకొని వెళతాడు. ఒసానొ అప్పటికే ఏడుగురు భార్యలకు డైవర్స్ ఇచ్చి పెద్ద మొత్తం భరణంగా ఇస్తాడు. తొమ్మిది మంది పిల్లలు. ఒసానొ మెరిలిన్ మధ్య పరిచయం గురుశిష్య సంబంధంలా మారుతుంది. ఒసానొకు హోటల్ లో పరిచయమైన సుందరి ఛార్లిబ్రౌన్ ను సహజీవనానికి తనవెంట న్యూయార్క్ తీసుకొని వెళతాడు. స్త్రీ సుఖమే జీవితానందమని భావించిన రచయిత ఒసానొ. పదేళ్ళక్రితం ప్రచురణ కర్తలవద్ద లక్ష డాలర్లు బజానా తీసుకొని రాసిస్తానన్న నవల ఎప్పటికీ రాయడు ఒసానొ. అతని జీవితానందమే అతన్ని కబళిస్తుంది. సిఫిలిస్ శరీరంలోని అన్ని భాగాలలో ప్రవేశించి మృత్యుముఖంలో చిక్కుకొంటాడు. చివరి క్షణాల్లో మెరిలిన్ ఒసానొను చూడడానికి వెళ్ళనపుడే అతను ప్రాణాలు విడుస్తాడు, అతని ప్రక్కన దుప్పటిలో నగ్నంగా ఛార్లిబ్రౌన్ శయనించి ఉంటుంది.

జేన్లీ సినిమా తారగా నిలదొక్కుకొని ప్రసిద్ధురాలవుతుంది. జేన్లీ, ఛార్లిబ్రౌన్ ఇద్దరు యువతుల మధ్య దైహికప్రేమ కొనసాగినా జేన్లీకి మెరిలిన్ పట్ల ప్రణయం తగ్గదు. ఆమెప్రేమను అర్ధంచేసుకోలేని మెరిలిన్ ఆమెకు దూరమవుతాడు.

మెరిలిన్ మిత్రుడు కెల్లి హోటల్ యజమాని గ్రోమ్.వెల్టు తరఫున నమ్మకమైన ఉద్యోగిగా జపాన్, హాంగ్ కాంగ్ వెళ్ళి మిలియన్ల డాలర్లు వెగాస్.కు రహస్యం గా చేరవేయవలసి వస్తుంది. ఈ ప్రయత్నంలో పట్టబడితే బయటపడలేడు. మెరిలిన్ ని తనకు సాయంగా వెంట రమ్మంటాడు కెల్లి. స్నేహధర్మంగా కెల్లివెంట వెళతాడు మెరిలిన్. వారి సాహసం విజయవంతమైంది. కెల్లి హోటల్ యజమాని నమ్మకం చూరగొంటాడు. హోటల్ యజమాని పక్షవాతం నుంచి కోల్కొన్న తర్వాత అతను హోటల్ నిర్వహణ కెల్లిపైన విడిచిపెడతాడు. కెల్లి దురాశాపరుడై తను ఆ హోటల్ యజమాని కావాలని భావించి, మరొక మారు జపాన్ నుంచి అక్రమంగా డాలర్లు తరలించడానికి పూనుకొంటాడు. ఆప్రయత్నంలో హోటల్ యజమాని మనుషులు అతన్ని జపాన్ లో జలసమాధి చేస్తారు.

మెరిలిన్ జర్నలిస్టుగా, రచయితగా స్థిరపడతాడు. హోటల్ Xanduలోని ముగ్గురు మిత్రులకథ ఆవిధంగా ముగుస్తుంది.