ఫూల్‌చంద్ గాంధీ
ఫూల్‌చంద్ గాంధీ హైదరాబాదు రాష్ట్ర మంత్రి, మరాఠ్వాడా ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయనాయకుడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఫూల్‌చంద్ హైదరాబాదు విమోచనోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్య, ఆరోగ్యశాఖమంత్రిగా పనిచేశాడు.
ఫూల్‌చంద్ గాంధీ అప్పటి నిజాం రాజ్యంలోని ఉస్మానాబాదు జిల్లాలో సావుకారి (వడ్డీ వ్యాపారుల) కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్ర కాన్ఫరెన్సులలో చురుకుగా పాల్గొనే వాడు. 1946లో లాతూరులో జరిగిన ఏడవ మహారాష్ట్ర కాన్ఫరెన్సుకు ఏ.కే.వాఘ్మారే అధ్యక్షత వహించగా, ఫూల్‌చంద్ గాంధీ ఆహ్వాన సంఘాన్ని నిర్వహించాడు.[1]
పోలీసు చర్యకు ముందు సరిహద్దులో జరిగిన అళ్లర్లలో ప్రమేయం ఉన్నదన్న కారణంగా ఉస్మానాబాదులోని ఈయన ఆస్తులన్నీ నిజాం ప్రభుత్వం జప్తు చేసి ఈయన వ్యాపారాన్ని మూసివేసింది.
మూలాలుసవరించు
- ↑ Kate, P. V. (1987). Marathwada Under the Nizams, 1724-1948. Mittal Publications. p. 71. ISBN 9788170990178. Retrieved 25 December 2014.