ఫెర్రీ అనేది ఒక రకమైన పడవ లేదా ఓడ, దీనిని నీటిపై మనుషులను, వాహనాలను లేదా వస్తువులను తీసుకెళ్ళెందుకు ఉపయోగిస్తారు. ఫెర్రీలను సముద్రాలలో, సరస్సులలో, నదులలో ఉపయోగిస్తారు. చాలా ఫెర్రీలు రెగ్యులర్ గా నడచేవిగా, తరచుగా నడచేవిగా, రిటర్న్ సర్వీసెస్‌లుగా పనిచేస్తాయి. ప్రయాణికుల ఫెర్రీ అనేక చోట్ల ఆగుతూ పోతుంటుంది, ఇటువంటి వాటిని వాటర్ బస్ లేదా వాటర్ టాక్సీ అంటారు. సాధారణ ట్రాఫిక్ ద్వారా ప్రయాణించినప్పుడు ప్రపంచంలో కొన్ని ప్రదేశాలకు మాత్రమే ఫెర్రీ ద్వారా చేరవచ్చు, ఎందుకంటే ఇవి ఎక్కువ నీళ్ళున్న సముద్రాలలో, సరస్సులలో, నదులలో మాత్రమే ప్రయాణించగలవు. ఫెర్రీలు వంతెనలు లేదా సొరంగాల కంటే తక్కువ మూలధన ఖర్చు వలన స్థానాల మధ్య డైరెక్ట్ రవాణాను అనుమతిస్తూ అనేక నీటిగట్టు నగరాల, ద్వీపాల యొక్క ప్రజా రవాణా వ్యవస్థల యొక్క భాగంగా రూపొందినవి.

ఫిన్లాండ్ లో ఒక పెద్ద ఫెర్రీ.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫెర్రీ&oldid=2882388" నుండి వెలికితీశారు