ఫ్రెడ్రిక్ అగస్ట్ కెకూలే

ఫ్రెడ్రిక్‌ అగస్ట్‌ కెకూలే ఒక ప్రపంచ ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. ఇతను కర్బన రసాయన శాస్త్రములో పెక్కు ఆవిష్కరణలు చేశాడు.సేంద్రీయ రసాయన శాస్త్రంలో నిర్మాణ సిద్ధాంతానికి పునాది వేసిన జర్మన్ రసాయన శాస్త్రవేత్త[1] . ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఆయన చేసిన కృషి ముఖ్యమైనది.

ఫ్రెడ్రిక్‌ అగస్ట్‌ కెకూలే
ఫ్రెడ్రిక్‌ అగస్ట్‌ కెకూలే
జననం(1829-09-07)1829 సెప్టెంబరు 7
Darmstadt, Grand Duchy of Hesse
మరణం1896 జూలై 13(1896-07-13) (వయసు 66)
బాన్, జర్మన్ సామ్రాజ్యము
పౌరసత్వంజర్మనీ
జాతీయతజర్మనీ
జాతిCaucasian
వృత్తిసంస్థలుUniversity of Heidelberg
University of Ghent
University of Bonn
డాక్టొరల్ విద్యార్థులుJacobus Henricus van 't Hoff,
Hermann Emil Fischer,
Adolf von Baeyer,
Richard Anschütz
ప్రసిద్ధిTheory of chemical structure
Tetravalence of carbon
Structure of benzene
ప్రభావితం చేసినవారుAlexander Williamson
Charles Gerhardt
Auguste Laurent
William Odling
Charles Adolphe Wurtz
ముఖ్యమైన పురస్కారాలుCopley Medal (1885)

నేపథ్యము

మార్చు

రసాయనిక నిర్మాణాల ఇంజినీరు భవన నిర్మాణాలను చేపట్టే ఇంజినీరు కావాలనుకున్న ఓ వ్యక్తి, శాస్త్రవేత్తగా మారి అణువుల రసాయన నిర్మాణాలను ఆవిష్కరించాడు.భవన నిర్మాణంలో ఇటుకలు, సిమెంటు పాత్ర ఎలాంటిదో, రసాయన శాస్త్రంలో పరమాణువుల, వేలన్సీ బాండ్ల పాత్ర అలాంటిది. అణువుల రసాయన నిర్మాణాలను నిర్థారించడం ద్వారా కెకూలే ఆ శాస్త్ర అభివృద్ధికి ఎంతో దోహద పడ్డాడు.

ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో కార్బన్‌ పరమాణువు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది మిగతా మూలకాలతో సంయోగం చెందడం ద్వారా అనేక పదార్థాలను ఎలా ఉత్పన్నం చేస్తుందో కెకూలె విశ్లేషించి చెప్పగలిగాడు. ఆయన పరిశోధనల వల్ల రసాయనిక చర్యల్లో జరిగే అణుమార్పులను శాస్త్రవేత్తలు అర్థం చేసుకోగలిగారు. తద్వారా ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అనే కొత్త శాస్త్రాలు ఆవిర్భవించాయి.

జీవితం

మార్చు

జర్మనీలోని డామ్‌స్టాట్‌లో 1829 సెప్టెంబరు 7న పుట్టిన కెకూలే, తండ్రి సూచనపై ఆర్కిటెక్చర్‌ (భవన నిర్మాణ విద్య) చదివాడు. ఆపై రసాయన శాస్త్రంపై మక్కువ పెంచుకుని, ఇరవై మూడేళ్లకల్లా 1852లో జస్టస్ వాన్ లీబిగ్ ఆధ్వర్యంలో డాక్టరేట్ పొందాడు. లండన్‌ విశ్వవిద్యాలయంలోని రసాయన పరిశోధనాలయంలో జీతం లేకుండానే కొన్నాళ్లు పనిచేశాడు. ఇరవై తొమ్మిదేళ్లకే ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించి ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పరిశోధనలు చేశాడు.

ఒక పరమాణువు, ఇతర పరమాణువులతో కలిసే సంయోగ సామర్థ్యాన్ని వేలన్సీ (సంయోగత) అని, అలా కలిపే బంధాన్ని వేలన్సీ బాండ్‌ అని అంటారు. అణువుల రసాయన నిర్మాణాలను కనిపెట్టడంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓసారి కెకూలే బస్సులో ప్రయాణిస్తూ నిద్రలోకి జారుకున్నప్పుడు కలలో కార్బన్‌ పరమాణువులు ఒకదాని చుట్టూ మరొకటి గుండ్రంగా తిరుగుతూ సంకృత శృంఖలాలను (closed chains) పోలిన ఆకారాలలో కనిపించాయిట. ఆ తర్వాత పరిశోధనల్లో ఆయన కార్బన్‌ పరమాణువులు తమలో తామే కాకుండా మిగతా పరమాణువులతో కలిసినప్పుడు కూడా ఇలాంటి గొలుసుల బంధాలనే ఏర్పరుస్తాయని తేలింది. దీని వల్ల రసాయన చర్యల్లో పాల్గొనే పరమాణువుల బంధాలను ఫార్ములాలుగా కాకుండా తొలిసారిగా త్రీడైమన్షనల్‌ రూపంలో అర్థం చేసుకునే వీలు కలిగింది. ఇలా పరిశోధనలు కొనసాగిస్తున్న కెకూలేకు బెంజీన్‌ కొరుకుడు పడలేదు. వేలన్సీ నియమాలకు లోబడని దాని అణునిర్మాణం గురించి ఆలోచిస్తూ అలసిపోయి నిద్రపోయిన కెకూలేకు మళ్లీ కల వచ్చింది. కలలో ఓ పాము తన తోకను తానే నోటితో పట్టుకున్నట్టు కనిపించింది. దాంతో బెంజీన్‌ నిర్మాణం ఆయనకు స్ఫురించింది. తర్వాతి కాలంలో శాస్త్రవేత్తలు డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనిపెట్టడంలోను, ఆవర్తన పట్టిక ఆవిష్కరణలోను కెకూలే పరిశోధనలే మార్గం చూపాయి.బెంజీన్ నిర్మాణాన్ని కనుగొన్న తర్వాత అతను 1867 నుండి 1896 వరకు జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కెకూలే తన చివరి రోజుల్లో విశ్వవిద్యాలయంలో ఉన్నాడు.అతను 1896 జూలై 13న మరణించాడు.

గౌరవాలు

మార్చు

1895లో కెకూలే జర్మనీకి చెందిన కైజర్ విల్హెల్మ్ II చేత గౌరవించబడ్డాడు, బోహేమియాలోని స్ట్రాడోనిస్‌లో అతని కుటుంబం పూర్వ ఆధీనంలో ఉన్నందున అతని పేరుకు "వాన్ స్ట్రాడోనిట్జ్"ని జోడించే హక్కును ఇచ్చాడు . కెమిస్ట్రీలో లభించిన మొదటి ఐదు నోబెల్ బహుమతుల్లో మూడు అతని విద్యార్థులే గెలుచుకున్నారు వారు వాంట్ హాఫ్ (1901), ఫిషర్ (1902), బేయర్ (1905). 1885లో, కెక్లీకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేసిన పరిశోధనకు కోప్లీ మెడల్ ఆఫ్ సైన్స్ లభించింది.ఇతని స్మారక చిహ్నం బాన్ విశ్వవిద్యాలయంలోని మాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ ముందు ఉంది. 1877/78లో అతను బాన్ విశ్వవిద్యాలయానికి రెక్టర్ .1878, 1886 , 1891 సంవత్సరాల్లో అతను బెర్లిన్‌లోని జర్మన్ కెమికల్ సొసైటీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యాడు .1875లో అతను రాయల్ సొసైటీకి నాన్-రెసిడెంట్ మెంబర్‌గా ఎన్నికయ్యాడు , 1885 లో కోప్లీ మెడల్ అందుకున్నాడు .  అలాగే 1875లో అతను రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు .  1887 లో అతను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సంబంధిత సభ్యుడు అయ్యాడు .  1892లో అతను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో , 1893లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరాడు . 1875లో అతను సంబంధిత , 1885లో ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో విదేశీ సభ్యుడు అయ్యాడు..  అతను 1888 నుండి రాయల్ నెదర్లాండ్స్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (KNAW) లో విదేశీ సభ్యుడు.  1893లో అతను అకాడెమీ డెస్ సైన్సెస్‌లో సంబంధిత సభ్యుడు అయ్యాడు . 1970లో చంద్ర బిలం   , 2010లో గ్రహశకలం (13254) కేకులే పేరు పెట్టారు.

యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ (ప్రస్తుతం బాన్-ఎండెనిచ్‌లో ఉంది) అతని గౌరవార్థం "కెకూలే ఇన్‌స్టిట్యూట్"గా పేరు పెట్టబడింది.

డార్మ్‌స్టాడ్ట్ యొక్క టెక్నికల్ యూనివర్శిటీలో, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ యొక్క ప్రధాన లెక్చర్ హాల్‌కు అతని పేరు పెట్టారు.

మూలాలు

మార్చు
  1. "August Kekule von Stradonitz | German chemist | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-18.