బంజారాల చరిత్ర సంస్కృతి (పుస్తకం)

బంజారాల సంస్కృతి, చరిత్రను సమగ్రంగా తెలిపే ఈ గ్రంథంలో బంజారాలకు సంబందించిన అనేక విషయాలు చాల మందికి తెలియని అనేక విషయాలను తెలియ జేసే పరిశోధన గ్రంథము.

గ్రథ వివరాలు

మార్చు
 
బంజారా స్త్రీలు

రచన: చీనీ నాయక్: పుటలు: 600, వెల రూ: 400, మొదటి ముద్రణ: 1998, ప్రచురణ: హథీరాం భావాజీ పబ్లి కేషన్స్, 11/339 - A -1 అరవింద నగర్, అనంతపురం.

 
తిరుపతిలోని హాథీరాంజీ మఠం

గ్రంథం గురించి

మార్చు

బంజారాలు, సుగాలీలు, లంబాడీలు, ఇలా అనేక రకాలుగా పిలువ బడే వీరు రాజస్థాన్ కు చెందిన రాజ వంశీయులు. వెయ్యేండ్ల క్రితం మహమ్మదీయుల అరాచకాలకు బలై దేశంలో నలు దిక్కులకు పోయి సంచార జీవులుగా జీవనం సాగిస్తున్నారు. అదే విధంగా బంజారాలు మంచి దైవ భక్తులు కూడ. ఈ విషయాలను నిరూపించ డానికి రచయిత చాల ఉదాహరణలను చూపారు. ఈ గ్రంథము వ్రాయడానికి రచయిత అనేక విషయాలను పరిశోదించి, పరిశీలించి చాల శ్రమ తీసుకున్నాడు.

గ్రంథంలోని మచ్చుకు కొన్ని పుటలు

మార్చు

బంజారాలు మంచి దైవ భక్తులు: పూర్వం తిరుమల-తిరుపతి దేవస్థానం హథీరాం బావాజి మఠటం ఆధీనంలో వుండేది. మఠాథిపతి హథీరాం ఒక బంజారా. అతని తర్వాత తి.తి.దేవ స్థానం ప్రభుత్వ పరమైనది. కాని మఠాధిపతి బంజారా అయినందున బంజారాలకు అనగా తిరుమల తిరుపతి కి వచ్చే బంజారాలకు ఆ మఠంలో వసతి ఏర్పాటు చేసే వారు. తిరుపతిలో కూడ ఇంకా చాల పెద్ద మఠం వున్నది. కాని ప్రస్తుతం ఆ మఠం బంజారాలను చిన్న చూపు చూస్తున్నది.

బంజారాలు చాల మంచి దేశ భక్తులు. రాజ భక్తులు. వారి భక్తి తత్వానికి మెచ్చి అల నాటి గోల్కొండ కోట దర్వాజాలలో ఒక దానికి బంజారా దర్వాజ అని పేరు పెట్టారు.