బండారు సుజాత శేఖర్
బండారు సుజాత శేఖర్ తెలంగాణకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త.[1]
బండారు సుజాత | |
---|---|
జననం | సుజాత |
వృత్తి | ఉపాధ్యాయురాలు |
ప్రసిద్ధి | కవయిత్రి, రచయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త |
భార్య / భర్త | శేఖర్ |
విశేషాలు
మార్చునల్గొండ జిల్లా, దేవరకొండగ్రామానికి చెందిన బండారు సుజాత పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు, తెలుగు అంశాలలో ఎం.ఎ. చదివింది. ఎం.ఇడి. చేసింది. బతుకమ్మ పాటలు - పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక భాషాపరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందింది. బతుకమ్మ పాటలపై మొట్టమొదటి పరిశోధన ఇది. ఈమె యాదాద్రి - భువనగిరి జిల్లా, గుజ్జ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ ఉంది.
విద్యారంగ కృషి
మార్చుఈమె ఉపాధ్యాయునిగా నూతన విద్యా విధానంలో తొలితరం పాఠ్యపుస్తక రచయిత్రిగా, గాయనిగా పిల్లలకు నిత్యనూతనంగా సృజనతో బోధించడానికి ఇష్టపడుతుంది. బోధనకు సంబంధించి తొలి అడుగు వేసిన పాఠ్యపుస్తక రచయిత్రి ఈమె. ఓపెన్స్కూల్ దూరవిద్యా విధానం పాఠ్యపుస్తకాల్లో రచయిత్రిగా సమన్వయకర్తగా ఎంతో ప్రతిభను కనబరించింది. ఈమె ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకూ 100కు పైగా దూరవిద్యా విధానం పాఠ్యపుస్తకాలు, మాడ్యూల్ల తయారీలో పాలుపంచుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల నుండి సన్మానాలు పొందింది.
సామాజిక సేవ
మార్చుఈమె ప్రత్యేకంగా బాలికల/మహిళలపై వేధింపుల నివారణ, వారిని రక్షించడం అనే అంశంపై పనిచేసింది. అనేక అవగాహనా కార్యక్రమాలను వివిధ సంస్థలతో కలిసి నిర్వహించింది. స్త్రీ శిశు సంరక్షణ, బాలకార్మిక నిర్మూలన, విద్య ఆవశ్యకతలపై పాటలు వ్రాసి స్వయంగా పాడి, ఇతర కళాకారులతో పాడించి చైతన్యాన్ని కలిగించింది. మహిళల కోసం రాత్రి పాఠశాలలను నిర్వహించింది. 42 మాబడి పాఠశాలలను ఏర్పాటు చేసింది.1998-2002 మధ్యకాలంలో 63 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించింది. గిరిజన ప్రాంతాలలో ఆడపిల్లల అమ్మకాలను, భ్రూణ హత్యలను నివారించడానికి కృషి చేసింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత అనేక పాఠశాల, కళాశాలలో షి టీమ్ ఏర్పాటు చేసిన అవగాహన తరగతులకు అతిథిగా హాజరయ్యింది.
సాహిత్యసేవ
మార్చుఈమె 11 పుస్తకాలను ప్రచురించింది. రేడియోలో ,పత్రికల్లో, టీవీ చానల్స్,వెబ్ పత్రికలలో ఈమె పాటలు, కవితలు, ప్రసంగాలు ప్రచురించబడినాయి. అనేక అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని ప్రత్యేక ప్రశంసలను అందుకుంది. ఈమె నల్గొండ జిల్లాలో తొలి నానీల కవయిత్రి. ఆమె పాటలు సినిమాల్లో, యూట్యూబ్ లో వచ్చాయి. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన ఈమె తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి వారి ఉద్యమ సాహితీవేత్తగా ప్రత్యేక సత్కారాలు పొందింది.
రచనలు
మార్చు- కవిత పుష్పం
- సౌజన్య శిఖరాలు
- మనసు పాడింది
- దేవరకొండ గాంధీ - కొండలరావు జీవితచరిత్ర
- నిదురించని నిజం
- జొన్నకంకులు
- తేనెచినుకులు
- బతుకమ్మ పాటలు - పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక భాషాపరిశీలన (సిద్ధాంతగ్రంథం)
- తెలంగాణా మహనీయుడు - కె.సి.గుప్త (మోనోగ్రాఫ్)
పదవులు
మార్చు- కార్యదర్శి - సాంస్కృతిక సాహితీ సమాఖ్య - దేవరకొండ
- రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు - అభ్యుదయ రచయితల సంఘం
- రాష్ట్ర అధ్యక్షురాలు - కళావిభాగ్, అక్షరయాన్ మహిళా రచయితల సంఘం
- కార్యదర్శి - నల్గొండ జిల్లా రచయితల సంఘం
పురస్కారాలు
మార్చుఈమెకు లభించిన పురస్కారాలలో కొన్ని:
- కవిరత్న (1996)
- బి.ఎన్.రెడ్డి పురస్కారం (2003)
- అక్షర కళాభిమాని పురస్కారం (2012)
- లయన్స్ క్లబ్ వారిచే మహిళా శిరోమణి (2013)
- తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2016)
- కళారత్న (2017)
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "బండారు సుజాత శేఖర్". అక్షరయాన్. Retrieved 2 November 2024.