పూర్వం వేరే గ్రామాలకు చెందిన పశువులు దారితప్పి మరో గ్రామానికి వస్తే వాటిని ఈ బందెల దొడ్లలో కట్టేసేవారు. వాటి యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి తమ పశువులను విడిపించికెళ్ళేవారు. తమిళంలో పట్టి అంటే 'బందెలదొడ్డి' అని అర్థం. బందెలదొడ్డి లోనుండి ఎవరూ సొంతదారు అడగక వదిలేసిన గొడ్డు అనాథ పశువు అని భావం. ఎక్కడ బడితే అక్కడ మేసి బందెలదొడ్డికి తోలబడ్డ యెద్దు బందెయెద్దు. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో ఒక వేళ పశువులు తప్పిపోయి వచ్చినా, ఒకరి పశువులు మరొకరి పంటను పొరపాటున మేసినా బందెల దొడ్డి లోకి తోలేస్తారు. వాటి యజమానులు వచ్చి నష్టపడిన సొమ్మును చెల్లించి వారి పశువులను తీసుకెళ్ళాలి.

బందెలదొడ్డి సెంటర్సవరించు

పూర్వం బందెల దొడ్లు ఊరికి దూరంగా ఉండేవి. ఇప్పుడవన్నీ ఊరి సెంటర్లుగా మారాయి.

  • విజయవాడ మొగల్రాజపురంలో బందెలదొడ్డి సెంటర్
  • మార్కాపురం బందెలదొడ్డి సెంటర్
  • పాలకొల్లు బందెలదొడ్డి సెంటర్

బందెలదొడ్డిపై సాహిత్యంసవరించు

జంగిలి కాంతల నెల్లా సంగతులెంచక నీవు
యెంగిలి సేసేవు మోవి యేకము గాను
పంగించ నీ నోరు బందె యెద్దు మోరాయ
కాంతలకు నీ మోవి గాడిపట్టు ---అన్నమయ్య :
  • కె.వి. కూర్మనాధ్ ‘బందెలదొడ్డి’ కథ