బఖ్త్ ఖాన్

భారతీయ విప్లవకారుడు

బఖ్త్ ఖాన్, (1797–13 మే 1859) ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు 1857 కు భారత సైన్యాధ్యక్షుడు.

బఖ్త్ ఖాన్

నేపథ్యం

మార్చు

యూసుఫ్‌జాయి తెగ శాఖ అయిన రొహిల్లా తెగ నాయకుడైన నజీబుద్దౌలా కుటుంబానికి చెందిన పష్తూన్ (పక్తూన్) ఈ బఖ్త్ ఖాన్. ఇతడు రోహిల్‌ఖండ్ కు చెందిన బిజ్నోర్ లో జన్మించాడు. ఆతరువాత ఈస్ట్ ఇండియా కంపెనీలో సూబేదార్ గా నియమితుడయ్యాడు. బెంగాల్ హార్స్ ఆర్టిల్లరీలో 40 సంవత్సరాల సుదీర్ఘ సేవలందించాడు.

తిరుగుబాటు

మార్చు

ఢిల్లీ లోని రెండవ బహాదుర్ షా సేనలకు నాయకుడైన బహాదుర్ షా రెండవ కుమారుడు మిర్జా మొఘల్ అంతగా తర్ఫీదు లేనివాడు. అలాంటి తరుణంలో బహాదుర్ షా, బఖ్త్ ఖాన్ కు "సాహెబ్ ఎ ఆలం బహాదుర్" (లార్డ్ గవర్నర్ జనరల్) అనే బిరుదునిచ్చి తన సేనలకు ముఖ్య అధిపతిగా నియమించాడు.

బఖ్త్ ఖాన్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు. బ్రిటిష్ వేగులు ఢిల్లీ నగరంలో బహాదుర్ షాను లొంగిపొమ్మని తీవ్ర వత్తిడి తీసుకొచ్చారు. తగిన తర్ఫీదు లేని కారణంగా బహాదుర్ షా సేనలు బలహీన పడ్డాయి. సరైన అవగాహన నియంత్రణ లేని కారణాలు కృంగదీసాయి. ఢిల్లీ ఆంగ్లేయుల వశమయింది.

బహాదుర్ షా హుమాయూన్ పేలెస్ లో బందీ గావింపబడ్డాడు.

బఖ్త్ ఖాన్ తిరుగుబాటు దారులతో చేతులు కలపడానికి లక్నో, షాజహాన్ పూర్ కు బయలుదేరాడు. 1859 తీవ్రమైన గాయాల వల్ల వీరస్వర్గం పొందాడు ನೇಪಾಳದ ತೇರೈನಲ್ಲಿ.

మూలాలు

మార్చు