బట్టల రామస్వామి బయోపిక్కు
బట్టల రామస్వామి బయోపిక్కు గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన తెలుగు సినిమా. సతీష్‌కుమార్, రామకృష్ణ వీరపనేని నిర్మించిన ఈ చిత్రంలో ఆల్తాఫ్ హాసన్, శాంతిరావు నటించగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర టీజర్‌ను 2021, మార్చి 5న రిలీజ్ చేశారు.[1] ఈ సినిమా జీ 5 ఓటీటీలో 2021, మే 14న విడుదలయింది.[2]
బట్టల రామస్వామి బయోపిక్కు | |
---|---|
దర్శకత్వం | రామ్ నారాయణ్ |
రచన | రామ్ నారాయణ్ , వాసుదేవమూర్తి |
తారాగణం | ఆల్తాఫ్ హాసన్, శాంతిరావు, లావణ్యా రెడ్డి, సాత్వికా జై |
ఛాయాగ్రహణం | పీ.ఎస్.కె మని |
కూర్పు | సాగర్ దడి |
సంగీతం | రామ్ నారాయణ్ |
పంపిణీదార్లు | జీ5 స్టార్ట్ |
విడుదల తేదీ | 14 మే 2021 |
సినిమా నిడివి | 137 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమా ప్రారంభోత్సవం 2019, నవంబరు 3న హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇవ్వగా, కెమెరామన్ జయరామ్ స్విచ్చాన్ చేశాడు. దర్శకుడు చంద్రమోహన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ఈ కార్య క్రమంలో రచయిత భాస్కరభట్ల, నటులు రామ్ కార్తీక్, గౌతమ్ కృష్ణ పాల్గొని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. [3][4]ఈ చిత్ర షూటింగ్ 2019, డిసెంబరు 18న షూటింగ్ పూర్తి చేశారు. [5]
కథ
మార్చురామస్వామి (అల్తాఫ్ హసన్) కి జీవితంలో రెండు లక్ష్యాలు ఉంటాయి. అవేంటంటే శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి.. చీరల వ్యాపారం బాగా చేయాలి. పూసలు అమ్ముకునే జయప్రద (శాంతి రావు)ను రామస్వామి (అల్తాఫ్ హుస్సేన్) తొలి చూపులోనే ఇష్టపడి ప్రేమలో పడుతాడు. గ్రామ పెద్దలను ఒప్పించి జయప్రదను రామస్వామి కులాంతర వివాహం చేసుకొంటాడు. అలానే బట్టల వ్యాపారం కొనసాగిస్తుంటాడు. ఇలా అతను కోరుకున్నట్లే జరుగుతుందని అనుకుంటుండగా.. అనుకోని పరిస్థితుల్లో జయప్రద చెల్లెలు జయసుధ (లావణ్య రెడ్డి)ని కూడా రామస్వామి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో పక్క గ్రామానికి చెందిన మరో యువతి శ్రీదేవి (సాత్వికా జయ్) ని రామస్వామి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది ఈ సినిమా కధ. [6]
నటీనటులు
మార్చు- ఆల్తాఫ్ హాసన్ - బట్టల రామస్వామి
- శాంతిరావు - జయప్రద
- లావణ్యా రెడ్డి - జయసుధ
- సాత్వికా జై - శ్రీదేవి
- భద్రం
- శ్రీ చందన
- శ్రీ వర్ధన్
- నటరాజ్
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థ : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
- సమర్పణ: మ్యాంగో మాస్ మీడియా
- నిర్మాతలు: సతీష్ కుమార్ ఐ, వి. రామకృష్ణ వీరపనేని (‘మ్యాంగో’ రామ్)
- స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: రామ్ నారాయణ్
- కథ: రామ్ నారాయణ్, వాసుదేవమూర్తి
- డైలాగ్స్, పాటలు: వాసుదేవమూర్తి
- ఛాయాగ్రహణం: పీ.ఎస్.కె మని
- ఎడిటింగ్: సాగర్ దాడి
- కొరియోగ్రాఫర్ : హరి తాటిపల్లి
- ఆర్ట్ డైరెక్టర్ : ఉపేందర్ రెడ్డి
- కాస్ట్యూమ్స్: మాన్వి గౌతమ్
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (8 May 2021). "జీ 5 ఓటీటీలో 'బట్టల రామస్వామి బయోపిక్కు'.. ఎప్పుడంటే?". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ Sakshi (3 November 2019). "బట్టల రామస్వామి బయోపిక్కు". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ Surya (3 November 2019). "పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన బట్టల రామస్వామి బయోపిక్కు". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ Andhrabhoomi (13 January 2020). "కామన్‌మేన్ బయోపిక్ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". Retrieved 8 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (15 May 2021). "'బట్టల రామస్వామి బయోపిక్కు' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 15 మే 2021. Retrieved 15 May 2021.