బయ్యారం చెరువు మహబూబాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రం నుండి 12 కి.మీ. దూరంలో బయ్యారం గ్రామం వద్ద ఉంది. ఈ చెరువును కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సోదరి మైలమాంబ నిర్మించింది. [1] తన తల్లి బయ్యమాంబ పేరిట దీనికి బయ్యారం చెరువు అని పేరు వచ్చింది. దీనికి బయ్యారం పెద్దచెరువు అని కూడా అంటారు. ఈ చెరువు ద్వారా 7200 ఎకరాలకు సాగు నీరు అందుతుంది.[2].దీన్ని 1969లో పునర్నిర్మించి దీని ఆయకట్టును 5400 ఎకరాల నుండి 7200 ఎకరాలకు పెంచారు.

బయ్యారం చెరువు
దేశంభారత దేశం
ప్రదేశంబయ్యారం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతసాగునీరు
ప్రారంభ తేదీ13 వ శతాబ్దం
యజమానితెలంగాణ ప్రభుత్వం
జలాశయం
సృష్టించేదిబయ్యారం చెరువు
మొత్తం సామర్థ్యం0.397 టిఎంసి
పరీవాహక ప్రాంతం567 చ.కి.మీ

చెరువు నుండి మొత్తం పది కాలువల ద్వారా 7,200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వీటిలో ప్రధానమైన కాలువలు - పెద్ద కాలువ 10.05 కి.మీ. ప్రవహించి 3,800 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. గుండూరు కాలువ 5.7 కి.మీ. ప్రవహించి 1,330 ఎకరాలకు, తునికి కాలువ 3.45 కి.మీ. ప్రవహించి 710 ఎకరాలకూ సాగునీరు అందిస్తాయి.[2] పందిపంపుల వాగు ఈ చెరువుకు ప్రధానమైన నీటి వనరు. చెరువుకూత్తర దక్షిణాల్లో ఉన్న కొండల నుండి కూడా వర్షపు నీరు వచ్చి చెరువులో కలుస్తుంది.[3]

ఈ చెరువు వద్ద లభించిన 13 వ శతాబ్దం నాటి సంస్కృత శిలాశాసనం కాకతీయుల వంశ చరిత్రను వివరిస్తోంది. పర్యాటక శాఖ, పురావస్తు శాఖలు ఈ శాసనాన్ని పునరుద్ధరించి చెరువు పక్కనే ప్రతిష్ఠించారు. ఈ శాసనం పీఠంపైనున్న గ్రానైటు రాతిపై శాసన అనువాదాన్ని చెక్కించారు.[4]

మూలాలు

మార్చు
  1. బయ్యారం చెరువు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  2. 2.0 2.1 "బయ్యారం ట్యాంక్" (PDF). తెలంగాణ పభుత్వ సాగునీటి పారుదల శాఖ. Archived (PDF) from the original on 2020-06-09. Retrieved 2020-06-09.
  3. Babu, Velugu (2019-02-25). "చరిత్రకు సాక్ష్యంగా నిల్చిన బయ్యారం చెరువు". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.
  4. Sridhar, P. (2012-05-20). "13th century stone inscription restored". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.