బలిపీఠంపై భరతనారి
బలిపీఠంపై భారతనారి 1989లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వేణుగోపాల ఆర్ట్ మూవీస్ పతాకంపై వేముల రామయ్య చౌదరి, బేతం శెట్టి రమేష్ బాబు లు నిర్మించిన ఈ సినిమాకు టి.కృష్ణ దర్శకత్వం వహించాడు. మాదాల రంగారావు, లక్ష్మీ ప్రియ, అరుణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
బలిపీఠంపై భరతనారి (1989 తెలుగు సినిమా) | |
సంగీతం | కె.వి.మహదేవన్ |
---|---|
నిర్మాణ సంస్థ | వేణుగోపాల ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ చిత్రంలో రాజకీయ నాయకుల అక్రమాలు, వారు చేసే అత్యాచారాలు చూపించి ప్రతీకారం వ్యక్తిగతంగా గాక సామూహిక స్థాయిలో ఉండాలని నిర్డేశించారు. పరాత్పరరావు, అతని కుమారుడు ప్రజాపతి దుష్టులు ఎన్నో అక్రమాలు చేస్తారు. అమాయకులను బలిగొంటారు. ఎర్రన్న అనే ధీరుడు వారిని ఎదుర్కొంటాడు. మరో ప్రపంచం చూపిస్తానంటూ బాధితులకు తన ఆశ్రమం వద్ద ఆశ్రయమిస్తాడు. అక్కడ బాలలు విప్లవ వీరులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటారు. భారతమ్మ తన కొడుకు రాజేష్ తాగుబోతు, హంతకుడు వ్యభిచారిగా మారడంతో ముగింపులో ఆగ్రహంతో అతన్ని నరికి చంపుతుంది. అలాగే రాజకీయ నాయకుని భార్య స్వహస్తాలతో భర్తను సజీవంగా దహనం చేస్తుంది. మాదాల రంగారావు విప్లవ వీరునిగా నటించాడు. అతని నటనలో ఏమీ మార్పులేదు. వల్లం నరసింహారావు డప్పు మోగిస్తూ అతనికి సహాయంగా ఉండే పాత్ర పోషించాడు.
తారాగణం
మార్చు- మాదార రంగారావు
- కిషోర్
- హరి
- ఫణి
- మూర్తి
- సుబ్బారావు
- వల్లం నరసింహారావు
- పరమనందం
- వెంకటేశ్వరరావు
- లక్ష్మీప్రియ
- మధు
- అరుణకుమారి
- జయశీల
- ప్రియాంక
- చందన
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: పూసల
- పాటలు: సి.నారాయణరెడ్డి, జాలాది
- సంగీతం: జె.వి.రాఘవులు
- కెమేరా: యన్.యన్.రాజు
- నిర్మాతలు: వేముల రామయ్య చౌదరి, బేతంశెట్టి రమేష్ బాబు
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టి.కృష్ణ
మూలాలు
మార్చు- ↑ "Balipeetampai Bharatha Nari (1989)". Indiancine.ma. Retrieved 2021-04-18.