బషు, ది లిటిల్ స్ట్రేంజర్ (1989 సినిమా)
బహ్రమ్ బీజాయ్ దర్శకత్వంలో 1989లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం
బషు, ది లిటిల్ స్ట్రేంజర్ 1989లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. బహ్రమ్ బీజాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుసాన్ తస్లిమి, పర్విజ్ పూర్హోస్సేని, అద్నాన్ అఫ్రావియన్, బషు తదితరులు నటించారు.
బషు, ది లిటిల్ స్ట్రేంజర్ | |
---|---|
దర్శకత్వం | బహ్రమ్ బీజాయ్ |
రచన | బహ్రమ్ బీజాయ్ |
నిర్మాత | అలీ రెజా జార్రిన్ |
తారాగణం | సుసాన్ తస్లిమి, పర్విజ్ పూర్హోస్సేని, అద్నాన్ అఫ్రావియన్ |
ఛాయాగ్రహణం | ఫిరూజ్ మాలెక్జాదే |
కూర్పు | బహ్రమ్ బీజాయ్ |
విడుదల తేదీ | 1989 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | ఇరాన్ |
భాష | పర్షియన్ |
కథానేపథ్యం
మార్చుబషు తన గ్రామాన్ని వదిలి వేరే గ్రామానికి వెలుతాడు. నల్లని రంగులో ఉన్న బషు, తాను ఈ ఊరివాడినేనని నిరూపించడంకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. నల్లరంగులో ఉన్న బషు తమవాడు కాదని అక్కడివారు గుర్తిస్తారు. అతను తన మాతృభాషలో పాడినప్పుడు, నృత్యం చేసేటప్పుడు గ్రామానికి చెందిన పిల్లలు అతన్ని ఎగతాళి చేస్తారు.[1]
నటవర్గం
మార్చు- సుసాన్ తస్లిమి
- పర్విజ్ పూర్హోస్సేని
- అద్నాన్ అఫ్రావియన్
- బషు
- అక్బర్ దూద్కర్
- ఫరోఖ్లాఘా హుష్మండ్
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: బహ్రమ్ బీజాయ్
- నిర్మాత: అలీ రెజా జార్రిన్
- ఛాయాగ్రహణం: ఫిరూజ్ మాలెక్జాదే
- కూర్పు: బహ్రమ్ బీజాయ్
- కాస్ట్యూమ్, ప్రొడక్షన్ డిజైన్: బహ్రమ్ బీజాయ్, ఇరాజ్ రామిన్ఫర్
- ప్రొడక్షన్ మేనేజ్మెంట్: ఫాథోలా దలిలి
ఇతర వివరాలు
మార్చు- 1986లో రూపొందిన ఈ చిత్రం 1989లో విడుదలయింది.
- కామిక్ రిలీఫ్ కాకుండా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఉత్తర భాషను ఉపయోగించిన ఇరాన్ తొలిచిత్రమిది.
- పెర్షియన్ చలనచిత్ర పత్రిక "పిక్చర్ వరల్డ్" 1999, నవంబరులో నిర్వహించిన పోల్ లో 150 ఇరానియన్ విమర్శకులు, నిపుణులచే "ఆల్ టైం ఉత్తమ ఇరానియన్ చలనచిత్రం" గా ఎంపికైంది.[2]
- బషు, ది లిటిల్ స్ట్రేంజర్ సినిమాను ఆధారం చేసుకొని 2004లో మలయాళ చిత్రం కాజ్చా అనే మళయాల చిత్రం తీయబడింది.[3]
- ఏకజాతి ఆలోచనలను సవాలు చేసే ఇరానియన్ సినిమాలోని మొట్టమొదటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది.[4]
మూలాలు
మార్చు- ↑ "Blackness on the Iranian Periphery: Ethnicity, Language, and Nation in Bashu, the Little Stranger - Ajam Media Collective". Ajam Media Collective (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-09-23. Retrieved 18 August 2019.
- ↑ Picture world (Donyaye tassvir), No. 74, November 1999, ISSN 1023-2613
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/news/Row-over-Kerala-State-Films-Award/articleshow/15137396.cms
- ↑ "World Cinema Directory". worldcinemadirectory.co.uk (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 18 August 2019.